Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : పడిపోయిన చమురు ధరలు..ఇండియా భారీ ప్లాన్!

By:  Tupaki Desk   |   11 April 2020 2:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : పడిపోయిన చమురు ధరలు..ఇండియా భారీ ప్లాన్!
X
కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే భారీగా తగ్గిపోయింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడం తో చమురుకు డిమాండ్ తగ్గింది. అదే సమయంలో ఇటీవల రష్యా-సౌదీ అరేబియా నేతృత్వంలోని యూఏఈ మధ్య ధరల యుద్ధం నడిచింది. దీంతో 20 డాలర్లకు కూడా పడిపోయింది. ఒపెక్ దేశాల సమావేశం నేపథ్యంలో డీల్ కుదురుతుందనే అంచనాలతో ధరలు మళ్లీ కొంచెం పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ చమురు నిల్వలపై ఒక భారీ ప్లాన్‌ తో ముందుకువెళ్తుంది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 30 డాలర్లకు పైన ఉంది. దీనితో భారత్‌ కు ఇదొక గొప్ప అవకాశం అని కేంద్రం భావిస్తుంది. ధర తక్కువగా ఉన్నప్పుడే భూగర్భ చమురు నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది భారత్. దీనికోసమే..సౌదీ అరేబియా - యూఏఈ - ఇరాక్ వంటి దేశాల నుంచి ముడి చమురును మరింతగా దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. దీంతో భవిష్యత్తులో సరఫరా లేదా ధరలకు సంబంధించి భారత్ కి ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు.

భారత్ అత్యవసరాల కోసం 53.3 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిల్వలు దాదాపు 9.5 రోజులకు సరిపోతాయి. కర్ణాటకలోని మంగళూరు, పాదూర్‌ తో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖలో భూగర్భ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ నిల్వలు సగం ఖాళీగా ఉన్నాయి. వీటిని సౌదీ అరేబియా - యూఏఈ - ఇరాక్ దేశాల నుండి కొనుగోలు చేసిన చమురుతో వీటిని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి చమురు ధరలు ఏకంగా 60 శాతం క్షీణించాయి. చమురు కోసం కేంద్ర ఆర్థిక శాఖ నిధులు పక్కన పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.