Begin typing your search above and press return to search.
విజయవాడలో కుళ్లిన మాంసం అమ్మకాలు..!
By: Tupaki Desk | 27 April 2020 3:36 PM GMTవిపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ప్రజలు, పాలకులు అంతా కరోనా కట్టడి చేయడంలో బిజీగా ఉండటంతో .. పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరనుకున్నారో ఏమో ఇదే అదనుగా భావించి కుళ్లిన మాంసం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. మరణించిన కోళ్లను చికెన్ దుకాణాల్లో మాంసంగా విక్రయిస్తున్నారు విజయవాడలోని కొందరు దుకాణదారులు.
రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు విజయవాడ నగరాన్ని రోడ్ జోన్ గా ప్రకటించారు. అందులో భాగంగానే మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. అయితే శివారు ప్రాంతంలో మాత్రం మాంసం అమ్మకాలు కొనసాగుతున్నాయి. జక్కంపూడి ప్రాంతంలోని ఓ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న ఓ చికెన్ షాపులో మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా తనిఖీలు జరిపారు.
దుకాణంలో కుళ్లిన వాసన వస్తున్న కోళ్లను గుర్తించారు. వెంటనే దుకాణాన్ని సీజ్ చేశారు. రెడ్ జోన్ కారణంగా నగరంలో మాంసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో దుకాణ దారులు ఇలా అక్రమాలకు పాల్పడుతూ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికే కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏ మాత్రం సమంజసం కాదు.