Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకి 2.5 కోట్ల ఉద్యోగాలు గోవిందా !
By: Tupaki Desk | 20 March 2020 6:50 AM GMTకరోనా దెబ్బకి ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయం లో నిరుద్యోగం పై కరోనా ప్రభావం మరింతగా ప్రభావం చూపిస్తుంది. ఈ కరోనా దెబ్బకి ప్రపంచంలోని అన్ని దేశాలు విలవిలలాడిపోతున్నాయి. భారత్ లో కూడా ఇప్పుడిపుడే కరోనా తీవ్రత పెరుగుతుంది. రోడ్ సైడ్ వ్యాపారాలు 80 శాతం వరకు పూర్తిగా మూతబడ్డాయి. ఆదాయం లేకపోవడం తో మూడు పూటల తినే పరిస్థితి లేదు. రోజు సంపాదించుకుని తినే వారి పరిస్థితి రోజురోజుకి ఆందోళనకరంగా మారుతోంది. గతంలో కర్ఫ్యూ వున్న పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని చిన్న వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, ట్యాక్సీవాలా ఆదాయం కూడా పూర్తిగా పడిపోతోంది. ఓలా, ఊబర్ లకు బిజినెస్ చాలా తగ్గిపోయింది. ఎయిర్ పోర్ట్ బిజినెస్ అయితే అసలే లేదు. ఇండియా లో కొంత బెటర్ గా వున్నప్పట్టికీ ఇతర దేశాల్లో చిరు ఉద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్య లో ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. దాదాపు 2.5 కోట్ల ఉద్యోగులు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8,600 కోట్ల డాలర్ల నుండి 3.4 లక్షల కోట్ల డాలర్ల మేర ఆధాయాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.అలాగే అండర్ ఎంప్లాయిమెంట్ కూడా పెరిగే అవకాశముందని ఐ ఎల్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా వర్కింగ్ హవర్స్ తగ్గి, వేతనాలు తగ్గి ఈ పరిస్థితికి కారణం కావొచ్చునని , సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పైనా ప్రభావం పడుతుందని తెలిపింది. అంతర్జాతీయంగా పరస్పర సహకార విధానాల ద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఐ ఎల్ ఓ తెలిపింది. కార్మికులను సంరక్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అలాగే ఉద్యోగాలు, ఆదాయలకు మద్దతిచ్చేందుకు అత్యవసర, పెద్ద ఎత్తున సమన్వయ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.