Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: విమానాలకు ఎంత దుస్థితి?
By: Tupaki Desk | 11 March 2020 1:30 AM GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకడం తో విమానాశ్రయాలన్నీ బోసిపోతున్నాయి. విమానాల్లో అయితే జనం లేఖ ఖాళీగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత నియమాల ప్రకారం విమానాలు నడుపుతున్న సంస్థలు తమకు కేటాయించిన స్లాట్లలో కనీసం 80 శాతం ఉపయోగించాలి లేదా ప్రత్యర్థి విమానయాన సంస్థలకు వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది.
చైనా మరియు హాంకాంగ్ లాంటి కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు, ప్రదేశాలకు వెళ్లే విమానాలకు ఈ నియమం సడలించినప్పటికీ, కరోనా బాగా వ్యాపించిన ఇటలీ మరియు దక్షిణ కొరియా తో సహా అన్ని ఇతర గమ్యస్థానాలకు ఇది ఇప్పటికీ వర్తిస్తోంది, ఈ రెండుదేశాలకు వెళ్లడానికి ప్రయాణికులు దూరంగా ఉండటంతో భారీగా డిమాండ్ తగ్గిపోయింది.
దేశ ట్రాన్స్ పోర్టు సెక్రెటరీ జనరల్ గ్రాంట్ షాప్స్ తాజాగా విమాన సంస్థలకు కేటాయించే స్లాట్ లు ఇచ్చే విమానాశ్రయం కో-ఆర్డినేషన్ లిమిటెడ్ (ఎసిఎల్) కు లేఖ రాశారు, అనవసరమైన ఖర్చు మరియు కార్బన్ ఉద్గారాలను నివారించడానికి ఉద్దేశించిన 80/20 నిబంధనను ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా సడలించాలని కోరారు.
కరోనా కారణంగా విమానయాన సంస్థలు తమ స్లాట్‌లను నిలుపుకోవటానికి చాలా తక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్నాయి. కొన్ని ఖాళీగా కూడా విమానాలను నడిపిస్తున్నాయి. దీనివల్ల వాటికి భారీగా నష్టం వాటిల్లుతోంది.