Begin typing your search above and press return to search.
ఆర్టీసీ ఉద్యోగులకు తాకిన కరోనా ఎఫెక్ట్ .. 4 వేలమంది ఉద్యోగాలు ...?
By: Tupaki Desk | 15 May 2020 8:00 AM GMTచైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వల్ల మన దేశంలోని ప్రతిరంగంపై పడింది. ఈ మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే కొన్ని కంపెనీలు వేతనాల్లో కోతలు విధించాయి. ఈ- వైరస్ కారణంగా నష్టాల్లో కూరుకుపోతున్న ప్రైవేటు సంస్ధలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుకు ఒక్కొక్కటిగా ఆదేశాలు జారీ చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వ శాఖలు కూడా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించదానికి సిద్ధమవుతున్నాయి.
ఇప్పుడు, ఇదే పద్దతిలో ఏపీలో ప్రజా రవాణాశాఖ జారీ చేసిన తాజా ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. మహమ్మారి విజృంభన తో అమలులోకి వచ్చిన లాక్ డౌన్ వల్ల బస్సులన్నీ కూడా గత 50 రోజులుగా డిపోలకే పరిమితం అయ్యాయి. దీనితో ఆర్టీసీకి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకోవడం ద్వారా భారీ ఆర్ధిక భారాన్ని మోస్తున్న ప్రభుత్వానికి ఆర్టీసీ నష్టాలు తలనొప్పిగా మారాయి.
అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి , లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ, ప్రత్యేక రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్దమవుతున్న ఆర్టీసీ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కండక్టర్లు లేకుండానే బస్సులు నడపాలని తీసుకున్న నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే ఇప్పుడు వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారబోతోంది. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయని నేపథ్యంలో బస్సుల్ని పరిమితంగా నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రైవేటు కాంట్రాక్టు బస్సులకు మంగళం పాడటం ఖాయంగానే కనిపిస్తోంది.
అదే సమయంలో తక్కువ బస్సులు నడపడం ద్వారా మిగిలిన డ్రైవర్లకు, కండక్టర్లకు కూర్చుబెట్టి జీతాలు ఇవ్వాలి. దీనితో వీరిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్న చోట్ల సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఇళ్ల వద్ద ఉంటున్న వీరంతా ఇక విధులకు రావాల్సిన అవసరం లేదని డిపో మేనేజర్లు ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే , పరిస్థితులు అన్ని అనుకూలించిన తరువాత మళ్లీ వీరిని తిరిగి తీసుకుంటారో లేదో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.