Begin typing your search above and press return to search.

చికెన్ వ్యాపారుల పబ్లిసిటీ కష్టాలు !

By:  Tupaki Desk   |   18 March 2020 7:15 AM GMT
చికెన్ వ్యాపారుల పబ్లిసిటీ కష్టాలు !
X
కరోనా ..కరోనా ..కరోనా ..ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం గజగజవణికిపోతుంది. ఈ కరోనా దెబ్బ ప్రపంచంలోని ప్రతి రంగం పై పడింది. ముఖ్యంగా మన దేశంలో ఈ కరోనా వల్ల పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. చికెన్ తింటే కరోనా వస్తుంది అని వార్తలు వైరల్ అవ్వడం వల్లే ఇప్పటి వరకు పౌల్ట్రీకి రూ. 500 కోట్లు నష్టం వాటిల్లింది. దీనితో కోడి గుడ్డు, చికెన్‌ తినడం వలన కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి రూ.కోటి బహుమతిని అందజేస్తామని గుడ్ల కోళ్ల సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి మంగళవారం సవాల్ విసిరారు.

గత కొన్ని రోజులుగా గుడ్లు , చికెన్ ధరలు నేల చూపులు చుస్తూండటంతో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు . మాంసం, కోళ్లు, కోడిగుడ్లకు ప్రసిద్ధి చెందిన నామక్కల్‌ జిల్లాలో ఎన్నడూ లేనంతగా కోళ్ల ఫారాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనితో తమిళనాడు గుడ్ల కోళ్ల సమ్మేళం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ సమ్మేళం అధ్యక్షుడు ముత్తుస్వామి, ఉపాధ్యక్షుడు వాగ్లీ సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రోజులుగా కరోనా భయంతో కోడి మాంసం, కోడి గుడ్లు వ్యాపారం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రూ. 4.50 గా విక్రియిస్తున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు రూ. 1.30, కోడి మాంసం రూ. 80 నుంచి రూ. 20కి తగ్గిందన్నారు.

దీనికి కారణం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ కావడమే. నామక్కల్‌ మండలంలో 15 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, పాఠశాలలు సెలవుల కారణంగా అదనంగా మరో 4 కోట్ల గుడ్లు నిలిచిపోయాయని, వీటిని శీతలీకరణ పెట్టెల్లో పెట్టి ధర పెరిగిన తర్వాత విక్రయించవచ్చా అని ఆలోచిస్తున్నామన్నారు. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఎవరైనా నిర్ధారిస్తే వారికి తమ సమ్మేళం తరఫున రూ.కోటి బహుమతి అందజేస్తామని ప్రకటించారు. మాంసం తినడం వల్ల విదేశాలలో ఏమి జరగలేదు. అయితే ఇక్కడ కరోనా వలన ఎలాంటి నష్టం లేకపోయినా కోడి మాంసం తినకూడదని, కోడి గుడ్లు తినకూడదని వదంతులు రావడం తో ఈ వ్యాపారం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రజలు చికెన్ పై ప్రచారం అయ్యే వదంతులను నమ్మకుండా కోడి మాంసం, గుడ్లు తినాలని కోరారు.