Begin typing your search above and press return to search.

క‌రోనాకు మందు అంటే స్టాక్‌ మార్కెట్‌ లో జోష్‌!

By:  Tupaki Desk   |   30 April 2020 8:25 AM GMT
క‌రోనాకు మందు అంటే స్టాక్‌ మార్కెట్‌ లో జోష్‌!
X
క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు యావ‌త్ మాన‌వాళి ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. ఆ మ‌హ‌మ్మారికి మందు కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్ర‌మంలో స్టాక్ మార్కెట్లు కూడా ఎదురుచూస్తు్న‌ట్లు ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే క‌రోనా నివార‌ణ‌కు మందు క‌నిపెట్టార‌నే వార్త‌లు వినిపిస్తుండ‌డంతో భార‌త స్టాక్ మార్కెట్లు చాలా రోజుల త‌ర్వాత జోష్‌లో క‌నిపించాయి. ఈ క్ర‌మంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమ‌వ‌డం విశేషం.

క‌రోనా వైర‌స్ చికిత్సకు ప్రయోగాత్మక రీమెడిసివిర్ ఔషధం ప‌ని చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అంతర్జాతీయంగా సానుకూల ప‌వ‌నాలు వీచాయి. దీంతో ఆ సంకేతాలను అంది పుచ్చుకున్న స్టాక్ మార్కెట్ ఆరంభంలోనే భారీ లాభాలను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 909 పాయింట్ల లాభంతో 33,601 వద్ద - నిఫ్టీ 253 పాయింట్లు ఎగిసి 9,808 వద్ద ట్రేడ్ అవ‌డం విశేషం. ఈ క్ర‌మంలో సెన్సెక్స్ 33,600 వేలను అధిగమించింది. నిఫ్టీ 9,800 పాయింట్లను దాటేసింది. ఈ క్ర‌మంలో అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ నెల డెరివేటివ్ సిరీస్ ఈ రోజు ముగియనుంది.

దీంతో ఫార్మ - బ్యాంకింగ్ - ఆటో - ఐటీ రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 700 పాయింట్లు ఎగిసి 21,500 స్థాయిని దాటేసింది. మార్కెట్‌ లో టాటా మోటార్స్ 10 శాతం - మారుతీ 8 శాతం ఎగిసింది. వేదాంత - ఐసీఐసీఐ - ఇన్ఫోసిస్ - ఎంఅండ్ ఎం - టాటా స్టీల్ - జెఎస్ డబ్ల్యూ స్టీల్ - బజాజ్ ఫిన్ సర్వ్ - టెక్ మహీంద్ర - హెచ్‌ డీఎఫ్‌ సీ కూడా మార్కెట్‌ లో లాభాలు పొందేలా ఉన్నాయి. అయితే హెచ్‌ యూఎల్, - జెట్ ఎయిర్ వేస్ - హెక్సావేర్ మాత్రం నష్టాల బారిన ఉన్నాయి. అయితే సాయంత్రం వ‌ర‌కు ప‌రిస్థితి ఇలాగే ఉంటే స్టాక్ మార్కెట్లు లాభాలు పొందే అవ‌కాశం ఉంది.