Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా !

By:  Tupaki Desk   |   13 May 2021 11:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా  !
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భయంకరంగా కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే వేల కొద్ది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో కరోనా జోరు తీవ్రంగా కొనసాగుతుంది. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం దేశంపై ఇంకా కొనసాగుతుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దేశంలో రోజురోజుకీ కేసులు సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఇక మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో కొన‌సాగుతున్నాయి.

క‌రోనా కార‌ణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలైపోయాయి. వీటిలో విద్యా రంగం కూడా ప్ర‌ధాన‌మైంది. ఇప్ప‌టికే దేశంలోని చాలా బోర్డులు త‌మ ప‌రిధిలోని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డం లేదా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌రోనా ప్ర‌భావం యూపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌పై కూడా ప‌డింది. దేశ వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టే సివిల్ స‌ర్వీస్ ఉద్యోగాల ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేస్తూ బోర్డు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగానే సివిల్ స‌ర్వీసెస్ (ప్రిలిమిన‌రీ) ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 10, 2021కి వాయిదా వేశారు. ఈ ప‌రీక్ష‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 27 నుంచి నిర్వ‌హించాల్సి ఉంది. కానీ క‌రోనా దృష్ట్యా అక్టోబ‌ర్ 10కి వాయిదా వేశారు.