Begin typing your search above and press return to search.
కరోనా గండంః జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా!
By: Tupaki Desk | 18 April 2021 6:30 AM GMTకరోనా మహమ్మారి దేశం మొత్తాన్ని వణికిస్తోంది. రోజుకు రెండు లక్షల మేర కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతోంది. దీంతో.. పరిస్థితి మరింత విషమించకుండా తగిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు. ఇందులో భాగంగా.. వివిధ రకాల పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నాయి.
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసింది, ఇంటర్ మీడియట్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జేఈఈ మెయిన్స్ పైనా కరోనా ప్రభావం పడింది.
ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ.. 15 రోజుల ముందు సమాచారం ఇస్తామని తెలిపారు.
కాగా.. జేఈఈ పరీక్షలు ఇప్పటికే రెండు సెషన్లు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో రెండో సెషన్ నిర్వహించారు. ఈ నెలలో నిర్వహించాల్సిన మూడో సెషన్ వాయిదా పడింది. మరి, కొవిడ్ ఎప్పుడు అదుపులోకి వస్తుంది? ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? అన్నది తెలియట్లేదు.