Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం మూసివేత !
By: Tupaki Desk | 17 March 2020 9:21 AM GMTఇకపోతే , భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నేటికి దేశ వ్యాప్తంగా 122 పైగా కేసులు నమోదయ్యాయ. అందులో మొత్తానికి 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలా ప్రపంచ మహమ్మారి అయిన కరోనా దేశం లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా దెబ్బకి దేశంలోని అనేక రంగాలను ఇది ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు. ఈ వైరస్ వలన మాల్స్, స్కూల్స్ ఇలా అనేక రకాల చోట్ల ఎక్కడైతే మనుషులు ఎక్కువగా గుమిగూడుతారో అక్కడ వాటిని మూసివేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్ దేవుడి పై కూడా పడింది.
కరోనా వైరస్ చివరకు దేవుళ్లను కూడా వదిపెట్టడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు బడులను , గుడిలను కూడా మూసివేస్తున్నారు. తాజాగా ప్రముఖ పుణ్య క్షేతమైన షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేయబోతున్నారు. షిరిడీ ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 125 కరోనా కేసులు నమోదు కాగా ఒక మహారాష్టల్రోనే 39 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. షిర్డీ టూర్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ చివరకు దేవుళ్లను కూడా వదిపెట్టడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు బడులను , గుడిలను కూడా మూసివేస్తున్నారు. తాజాగా ప్రముఖ పుణ్య క్షేతమైన షిర్డీ సాయి ఆలయాన్ని మూసివేయబోతున్నారు. షిరిడీ ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 125 కరోనా కేసులు నమోదు కాగా ఒక మహారాష్టల్రోనే 39 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందు లో భాగంగా షిరిడీ ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఎవ్వరూ కూడా దర్శనానికి రావద్దని, భక్తులు తమ ప్రయాణాలను రద్దుచేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.