Begin typing your search above and press return to search.
స్టాక్ మార్కెట్లకు వైరస్.. చరిత్రలో ఎరుగని నష్టం
By: Tupaki Desk | 12 March 2020 2:08 PM GMTకరోనావైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపుతుం దో అంతకుమించి ఆర్థిక వ్యవస్థలనూ కుదేలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే కుదేలు కాగా ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పూర్తిగా పతనమయ్యాయి. కరోనా వైరస్ ను భయంకరమైన మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం తో... ఇన్వెస్టర్లు రెండో ఆలోచన లేకుండా అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో, ఇప్పటికే కుదేలైన మార్కెట్లు ఈరోజు పాతాళాన్ని తాకాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
అన్ని సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 3,200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,919 పాయింట్లు నష్టపోయి 32,778కి పడిపోయింది. నిఫ్టీ 868 పాయింట్లు పతనమై 9,590కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఒక్క కంపెనీ కూడా లాభాలను ఆర్జించలేకపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-12.11), ఓఎన్జీసీ (-11.93), యాక్సిస్ బ్యాంక్ (-11.60), ఐటీసీ (-10.96), టీసీఎస్ (-9.29) నష్టం తో టాప్ లూజర్లుగా భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.
ఎపుడూ లేని విధంగా మొత్తం 783 కంపెనీలు (ఇదే అత్యధికం) 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. వీటిలో రిలయన్స్, టీసీఎస్ కూడా ఉండటం విశేషం. కొన్ని సంవత్సరాలుగా లాభాల పంట పండిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌పీసీఎల్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, హీరో వంటివి కనిష్ట స్థాయికి పడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.