Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ .. ఫ్లైట్ లో పెళ్లి , వీడియో వైరల్
By: Tupaki Desk | 24 May 2021 4:12 AM GMTకరోనా వైరస్ విజృంభణ తో ప్రస్తుతం దేశం మొత్తం షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించనప్పటికి కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా లాక్ డౌన్ అనౌన్స్ చేసి అమలు చేస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి కేసులు , కరోనా మరణాలు మాత్రం పెరుగుతూనే పోతున్నాయి. లక్షల్లో కేసులు , వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే .. కరోనా విజృంభణ దెబ్బకి దాదాపుగా అన్ని పనులు ఆగిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొందరు మాత్రం .. కరోనా నియమాలు పాటిస్తూ పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకుంటే మంచిదే కదా .. అందులో ఏముంది వింత అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు వింత. ఇది మాములు పెళ్లి కాదు. కొంచెం వెరైటీ పెళ్లి. కరోనా దెబ్బకు భయపడి చేసుకున్న పెళ్లి. అది కూడా నేలపై కాదు నింగిలో. గాల్లో వెళుతున్న విమానంలోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తాళి కట్టి దంపతులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాకేష్, దక్షిణల పెళ్లి కూడా మంగళవారం జరగాలి. దీని కోసం ఇప్పటికే రెండు కుటుంబాల పెద్దలు బెంగళూరు నుంచి మదురైకి వచ్చే విమానంలో బయలు దేరారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. దీనితో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను కూడా రద్దు చేసుకున్న ఇరు కుటుంబాలు విమానంలోనే పెళ్లి చేసేశారు. ఇరు కుటుంబాల సమక్షంలో యువ జంట ఒక్కటైంది. కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.