Begin typing your search above and press return to search.

అప్పుడే పుట్టిన బిడ్డ.. కరోనా పిశాచి పట్టేసింది

By:  Tupaki Desk   |   6 Feb 2020 5:30 AM GMT
అప్పుడే పుట్టిన బిడ్డ.. కరోనా పిశాచి పట్టేసింది
X
కరోనా వైరస్ కు పుట్టిల్లు అయిన వూహాన్ లో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఈ మహానగరంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. తాజాగా ఒక ఆసుపత్రి లో పుట్టిన బిడ్డకు సైతం కరోనా లక్షణాలు కనిపించటంతో వైద్యులు తల పట్టుకుంటున్నారు. ఇప్పటికే కరోనా పిశాచి కారణంగా వూహాన్ మహా నగరం లో శశ్మాన వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా వూహాన్ నగరంలోని ఆసుపత్రిలో పుట్టిన ఒక పసిబిడ్డలోనూ కరోనా లక్షణాలు కనిపించటంతో షాక్ తిన్నారు. గత వారంలో కరోనా సోకిన గర్భిణికి జన్మించిన బిడ్డకు కరోనా వ్యాపించ లేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ప్రసవం తర్వాత 30 గంటలకు పసిబిడ్డకు సైతం కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. దీంతో ఆందోళనలు మరింత ఎక్కువ అయ్యాయి.

కరోనా ప్రభావంతో చైనాలో ఇప్పటికే మరణాల సంఖ్య బాగా ఎక్కువైంది. ఇప్పటివరకూ ఆ దేశంలో 425 మంది ఈ వైరస్ కారణంగా మరణించగా.. 20,438 కేసులు నమోదయ్యాయి. అనుమానితుల సంఖ్య లక్షల్లో ఉంది. కరోనా వైరస్ కు ప్రత్యేకంగా చికిత్స చేసేందుకు రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

మరో 1500 పడకల ఆసుపత్రిని అదే రీతిలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. గబ్బిలాల కారణంగానే ఈ వైరస్ సోకినట్లు గా వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణులు తేల్చినట్లుగా చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా ప్రమాకర స్థాయిని దాటేసే రీతిలో కరోనా వైరస్ ప్రభావం ఉందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.