Begin typing your search above and press return to search.

భారత్ లో మళ్లీ కరోనా భయం .. పెరిగిన కేసులు, తగ్గిన రికవరీలు !

By:  Tupaki Desk   |   8 July 2021 8:30 AM GMT
భారత్ లో మళ్లీ కరోనా భయం .. పెరిగిన కేసులు, తగ్గిన రికవరీలు !
X
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి , మళ్లీ విజృంభిస్తుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో గణనీయంగా తగ్గి మళ్లీ కొంచెం కొంచెంగా పెరుగుతూ టెంక్షన్ పెట్టిస్తున్నాయి. అలాగే దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. దీనితో దేశంలో మళ్లీ ఆందోళన పెరుగుతుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొత్త కేసుల నమోదు లో 5 శాతం పెరుగుదల కనిపించింది. కొత్త కేసులు రికవరీల కంటే ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. ఇండియాలో గత 24 గంటల్లో కరోనావైరస్ మహమ్మారి బారిన 45,892 మంది పడినట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఇక తాజాగా నిన్న ఒక్క రోజులో 817 కొత్త మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం యొక్క మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కు పెరిగింది. ఇక తాజాగా నమోదైన 817 మరణాలతో కలిపి, మొత్తం మరణాల సంఖ్య 405,028 కి చేరింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,60,704 గా ఉంది. 1.50% వరకు పెరిగిందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. గత 24 గంటల్లో 44,291 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. అలాగే , గత 24 గంటల్లో రికవరీల కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండడం టెంక్షన్ పెరిగేలా చేస్తోంది . ఇప్పటివరకు దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,98,43,825 గా ఉందని తెలుస్తుంది. గత 24 గంటల్లో 19,07,216 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశం యొక్క వారపు పాజిటివిటీ రేటు 2.37 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉంది. ఇది వరుసగా 17 వ రోజు 3% కన్నా తక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరిగిందని ఇప్పటివరకు 42.52 కోట్ల పరీక్షలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 36,48,47,549 కు చేరుకోగా, 33,81,671 మందికి గత 24 గంటల్లో టీకాలు వేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతానికి కొంచెం తగినట్లుగా కనిపిస్తున్న కారణంగా ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు రెండో వారం తర్వాత కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదుకావడం సైతం ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి నుండి ఇప్పుడే బయటపడినట్లు కాదని పదే పదే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. కాబట్టి ఇంకా కరోనా మహమ్మారి నుండి తప్పించుకోలేదు. ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. పేస్ మాస్కులు, శానిటైజేర్స్ వాడాలి. అలాగే దేశంలోని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చి టీకా తీసుకుంటే మూడో వేవ్ ముప్పుని తప్పించుకోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.