Begin typing your search above and press return to search.
కరోనా కల్లోలం: ఒక్కరోజులో లక్షకు కేసులా?
By: Tupaki Desk | 4 April 2021 7:35 AM GMTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు జెట్ స్పీడులా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ వచ్చినట్టే పరిస్థితులున్నాయి. కరోనా బారినపడి అనేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రోజు గడిచేసరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతు్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ప్రక్రియ కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 93249 కరోనా కేసులు నమోదయ్యాయి. 513మంది మరణించారు. రోజువారీ కేసుల్లోనూ వరుసగా మూడోరోజు కూడా హవా కొనసాగుతోంది. రెండు రోజులుగా 80వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.తాజాగా కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కును దాటింది. తీవ్రత చూస్తుంటే కరోనా కేసులు లక్షకు చేరువ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి గడిచిన నాలుగైదు నెలల్లో లక్షకు చేరువ కావడం ఇదే ప్రథమం.
ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,85,409కి చేరింది. 1,64,623 మంది మరణించారు. మహారాష్ట్రాలో అత్యధిక కేసులు ఉన్నాయి. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. ఒక్కరోజే మహారాష్ట్రలో 49వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.