Begin typing your search above and press return to search.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం.. ఒక్కరోజే 5.10 లక్షల కేసులు
By: Tupaki Desk | 4 Jan 2021 6:24 PM GMTచాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ కరోనా వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని కబళించిన ఈ మహమ్మారి ఈ మధ్యనే కొంత శాంతించింది. అయితే శీతాకాలం కావడం.. చలితీవ్రత పెరగడంతో అనువైన ఈ వాతావరణంలో రూపం మార్చుకొని కొత్త కరోనా స్ట్రెయిన్ లు పుట్టుకొచ్చి డేంజర్ గా మారుతోంది.
ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో రూపు మార్చుకున్న కొత్త కరోనా స్ట్రెయిన్ పెద్ద ఎత్తున సోకుతూ లాక్ డౌన్ లు పెట్టేదిశగా సాగుతోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కూడా మొదలు అయ్యింది. దీంతో మళ్లీ పాజిటివ్ కేసులు.. మరణాల సంఖ్య పెరిగిపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5,10,136 పాజిటివ్ కేసులు , 7420 మరణాలు సంభవించాయి. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,593,895కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 1,852,812 మంది మరణించారు. ఇక 60,555,292 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ కారణంగా ప్రతిరోజు లక్ష కేసు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 2.11 కోట్లకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 3.60 లక్షల మంది చనిపోయారు. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం చోటుచేసుకుంది.
ఇక భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1.03 కోట్లకు చేరింది. 1.49 లక్షల మంది కరోనాతో మరణించారు.