Begin typing your search above and press return to search.
ఒకే స్కూల్లో 190 మందికి మాయదారి మహమ్మారి
By: Tupaki Desk | 25 Feb 2021 1:16 PM GMTవెళ్లిపోయిందనుకున్న కరోనా మహమ్మారి.. తానింకా వెళ్లలేదని.. ఆ మాటకు వస్తే సమీప దూరంలో వెళ్లలేదన్న విషయం ఇప్పుడిప్పుడే దేశ ప్రజలకు.. పాలకులకు అర్థమవుతోంది. కేరళ.. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రత అంత లేకున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారిపోతోంది. తొలి వేవ్ లోనూ తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర.. సెకండ్ వేవ్ లో మరింత ఎక్కువగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది.
దీనికి తగ్గట్లే తాజాగా వెలుగు చూసిన ఉదంతం షాకింగ్ గా మారింది. వషిమ్ జిల్లాలోని ఒక పాఠశాలలోని హాస్టల్ లో190 మందికి వైరస్ సోకిన వైనం బయటకు వచ్చింది. పాజిటివ్ గా తేలిన 190 మందిలో 186 మంది విద్యార్థులు కాగా.. మిగిలిన నలుగురు ఉపాధ్యాయులు కావటం గమనార్హం. దీంతో ఉలిక్కిపడిన అధికారులు స్కూల్ పరిసరాల్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8 వేలకు పైగా కేసులునమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందంటున్నారు. నిన్న (బుధవారం) ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మరణించినట్లు చెబుతున్నారు. మరో దారుణమైన విషయం ఏమంటే.. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజులోనమోదైన యాక్టివ్ కేసుల్లో సగం మహారాష్ట్రంలోనే నమోదు కావటం షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భౌతిక దూరం.. మాస్కుల్ని ధరించటంతో పాటు.. మరీ అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటున్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కేసులు తక్కువగా నమోదవుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. రెండు తెలుగు రాష్ట్రాలకు తిప్పలు తప్పవనే చెప్పాలి.