Begin typing your search above and press return to search.
ట్యూషన్: టీచర్ ద్వారా 39మంది విద్యార్థులకు కరోనా
By: Tupaki Desk | 4 Oct 2020 11:50 AM GMTకరోనా తీవ్రత ఎంతకు తగ్గడం లేదు. బయటకు వెళితే చాలు ఈ మహమ్మారి అంటుకుంటోంది. ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో జనాలు కూడా దీనికి అలవాటు పడి జీవిస్తున్నారు. అయితే కొందరి తప్పు వల్ల చాలా మందికి కరోనా సోకింది.
గుంటూరులోని భట్లూరు ఎస్సి కాలనీలో ఓ ట్యూషన్ సెంటర్‌ను నడుపుతున్న టీచర్ కరోనా బారినపడ్డారు. తన నివాసంలో రెగ్యులర్ గా విద్యార్థులకు క్లాసులు చెప్తున్నాడు. ఈ మధ్య అక్కడ కోవిడ్ అధికంగా వ్యాపించడంతో టీచర్ కూడా వ్యాధి బారినపడ్డారు.టీచర్ లో లక్షణాలను గమనించి అతడిని.. అతడి ట్యూషన్ సెంటర్ కు వచ్చిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
అందులో 14 మంది విద్యార్థులకు, ఆ విద్యార్థుల కారణంగా వాళ్ల తల్లిదండ్రులకు.. అలా మొత్తం 30 మందికి ఒకేసారి కరోనా సోకింది. కరోనా బారిన పడిన విద్యార్థుల్లో అందరూ 7 ఏళ్ల లోపు పిల్లలే కావడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.. వెంటనే స్పందించిన అధికారులు గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టి అందరినీ హోం క్వారంటైన్ చేశారు. తల్లిదండ్రులు ఇప్పుడు వారి పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు.
ఒక రోజులో ముప్పై తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. పిల్లలకు ప్రాణాంతక వైరస్ విస్తరించడానికి ప్రధాన కారణం టీచర్ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నాడు. అతడి వల్లే తరగతిలోని విద్యార్థులకు ఇది వ్యాపిస్తుందని బాధితులు విమర్శించారు.
ఈ సంఘటన కారణంగా అధికారులు భట్లూరు ఎస్సి కాలనీని కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించి, శానిటైజ్ చేశారు.రోగులను హోం క్వారంటైన్ తోపాటు ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. చిన్న పిల్లలకు ఇంతమందికి కరోనా వ్యాపింపచేసిన టీచర్ కు అధికారులు నోటీసు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి తల్లిదండ్రులు ధృవీకరించబడిన పాఠశాలల తరగతులకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.