Begin typing your search above and press return to search.

కరోనాకు అమెరికాలో వైద్య సేవల కొరత

By:  Tupaki Desk   |   30 March 2020 7:30 PM GMT
కరోనాకు అమెరికాలో వైద్య సేవల కొరత
X
చైనాలో పుట్టి ప్రపంచానికి పాకిన కరోనా వైరస్‌ ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాను పట్టి పీడిస్తోంది. ఆ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో కరోనా నివారణకు వైద్య సేవలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వాస్తవంగా జనాభాకు అనుగుణంగా ఏ దేశంలో వైద్య సేవలు ఉండవు. ఆ మాదిరిగానే అమెరికాలో అంతంత మాత్రమే వైద్య సేవలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చిన రూపంలో ఆ దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఉన్న వైద్య సౌకర్యాలన్నీ అమెరికా వినియోగిస్తోంది.

అయితే వేగంగా కరోనా వ్యాప్తి చెందడంతో వైద్య ఏర్పాట్లు సిద్ధం చేసుకునేలోపు అమెరికా అంతటా వ్యాపించింది. అందుకే కరోనా కేసులు పెరగడానికి కారణంగా మారింది. ఈ క్రమంలో అక్కడి వైద్య సిబ్బంది సేవలు అందించడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అహోరాత్రులు శ్రమించి ప్రజలకు వైద్యం అందిస్తున్న పరిస్థితులున్నారు. అయితే కరోనా నివారణకు కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, పరికరాలు అందుబాటులో లేవు. దీంతో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇప్పటివరకు అమెరికాలో ప్రపంచంలో ఎక్కడ లేనట్టు లక్ష 42 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2,484 మంది మృతి చెందారు. ముందే స్పందించకపోవడంతో ఇప్పుడు కేసులు మరిన్ని పెరుగుతాయని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌ 59,648 కేసులతో అగ్ర స్థానంలో నిలవగా, న్యూజెర్సీలో 13 వేలు, కాలిఫోర్నియాలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కేసులు పెరుగుతున్న కొద్ది వైద్య సేవలు అందుకనుగుణంగా అందుబాటులో లేవు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ బాధితులకు వైద్యమే సక్రమంగా అందించని సమయంలో ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో వారికి వైద్య సేవలు అందించడం కష్టంగా మారింది. కరోనా బాధితులకు సరిపడా వైద్య, సిబ్బంది, పరికరాలు, ఏర్పాట్లు లేవు. దీంతో అతికష్టం మీద వైద్య సేవలు అందిస్తున్నారు.

అగ్రరాజ్యమే ఈ విధంగా కరోనాతో విలవిలలాడుతోంది. వైద్యానికి పెద్ద పీట వేయకుండా సైన్యానికి ప్రాధాన్యం ఇచ్చిన అమెరికా ఇప్పుడు కరోనా వైరస్‌తో ప్రమాదంలో పడింది. ఈ సమయంలో ప్రజలను కాపాడేది సైన్యమా? వైద్యులా? అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించాలని అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.