Begin typing your search above and press return to search.
ఆ విటమిన్ లోపిస్తే.. కరోనా ముప్పు ఎక్కువట!
By: Tupaki Desk | 29 March 2021 1:30 AM GMTకరోనా నియంత్రణకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని అంతం చేయడంతోపాటు.. అసలు ఎలా సోకుతుంది? ఎవరిపై ప్రభావం చూపుతుంది అనే కోణాల్లో పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో హైదరాబాద్ నిపుణులు జరిపిన పరిశోధనల్లో కొత్త విషయం వెలుగు చూసింది.
ఈ అధ్యయనం ప్రకారం.. డి విటమిన్ లోపం ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువ చూపుతుందని తేల్చారు. కరోనా మొదటి వేరియంట్ సమయంలోనే ఈ విషయమై హెచ్చరికలు జారీచేశారు. అయితే.. దాని తీవ్రత ఎంత అనే విషయమై నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యలు సంయుక్తంగా పరిశోధనలు చేశారు.
దీని ప్రకారం.. డి విటమిన్ ఎంత తక్కువగా ఉంటే.. వారిలో కరోనా ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అందువల్ల డి విటమిన్ పెంచుకునే మార్గం చూడాలని చెప్పారు. దీంతోపాటు.. శరీరంలో విటమిన్లు సమృద్ధిగా ఉంటే, వారిని కరోనా ఏమీ చేయలేదని చెప్పారు. ఇవి తగిన మోతాదులో ఉంటే.. కరోనా మహమ్మారిని నిలువరించడం సాధ్యమవుతుందని తేల్చారు.