Begin typing your search above and press return to search.
హైఅలెర్ట్: కలెక్టర్ తోపాటు 3 మంత్రులకు కరోనా రిస్క్?
By: Tupaki Desk | 4 May 2020 1:30 PM GMTఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఎటు నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీమలోని కర్నూలులో అయితే వందల కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు నగరం కరోనాకు హాట్ స్పాట్ గా మారింది.
ఇక కొద్దిరోజుల క్రితం కలెక్టర్ వీరపాండ్యన్ కర్నూలులోని రెడ్ జోన్ ప్రాంతాల్లో మాస్క్ లేకుండా పర్యటించారు. దీంతో ఆయన కరోనా భయంతో ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం.
కర్నూలు కలెక్టర్ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయినట్లు తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. దీంతో ఆయనతో ఇన్నాళ్లు సమీక్షించిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు షాక్ కు గురయ్యారు. ఇప్పటికే కరోనా వైరస్ పై పోరులో భాంగా కలెక్టర్ తో పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు కలిసి మాట్లాడారు. ఆయనతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఇప్పుడు వారంతా హడలి చస్తున్నారు.
కర్నూలు కలెక్టర్ హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కారణమనట.. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనతో కలిసి తిరిగిన కలెక్టర్ కూడా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారట..
ఇక ఇదే కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్ తో కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కార్మిక మంత్రి జయరాంలు జిల్లా కలెక్టరేట్ లో సమీక్షించారని ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇక కలెక్టర్ టీంలో ప్రత్యేక అధికారి అజయ్ జైన్ - ఐఏఎస్ అధికారులు హరిణినారాయణ - శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఇక ఓ ఎమ్మెల్యే సైతం కలెక్టర్ ను కలిశాడట.. దీంతో వీరందరికీ కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. కలెక్టరేట్ ను ఖాళీ చేయించి మొత్తం శుభ్రపరచాలని.. కెమికల్ స్ర్పే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ తో కలిసిన వారంతా ఇప్పుడు హడలి చస్తున్నారు. ఇందులో ముగ్గురు మంత్రులు ఉండడంతో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. వారికి టెస్టులు చేయడానికి రెడీ అయ్యింది.