Begin typing your search above and press return to search.

20 వేల సంవత్సరాల క్రితమే చైనాలో కరోనా..!

By:  Tupaki Desk   |   27 Jun 2021 11:30 PM GMT
20 వేల సంవత్సరాల క్రితమే చైనాలో కరోనా..!
X
ప్రపంచాన్ని గత ఏడాదిన్నర కాలంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలో పుట్టిందనే విషయం అందరికి తెల్సిందే. కరోనా చరిత్ర అనగానే ప్రతి ఒక్కరు 2019 చివర్లో చైనాలో పుట్టిందని చెబుతున్నారు. కాని తాజాగా ఆస్ట్రేలియా మరియు అమెరికాల శాస్త్రవేత్తల బృందం మాత్రం కరోనా వైరస్‌ ఇది 2019 సంవత్సరంలోనే పుట్టలేదని.. 20 వేల సంవత్సరాల క్రితమే ఉందని.. అప్పట్లోనే మనుషులకు కరోనా సోకిందని గుర్తించారు. ఆ శాస్త్రవేత్తల బృందం 20 వేల సంవత్సరాల క్రితంకు చెందిన 26 దేశాల 2500 మానవుల డీఎన్‌ఏ లను పరీక్షించడం జరిగిందట. అందులో వారు కరోనా వైరస్ ను గుర్తించారు.

20 వేల సంవత్సరాల క్రితమే ఆసియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగిందని వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చైనా.. జపాన్‌ ఇంకా వియత్నం వంటి దేశాల్లో కరోనా అప్పట్లోనే ఉందని వారు చెబుతున్నారు. తూర్పు ఆసియా నుండి సేకరించిన డీఎన్‌ఏ లో మాత్రమే కరోనా అధికంగా కనిపించిందని వారు చెబుతున్నారు. మొత్తం 26 దేశాల్లో కరోనా 20 వేల సంవత్సరాల క్రితమే ఉండి ఉంటుందని వారు చెబుతున్నారు. కరోనా కారణంగా వారు చనిపోయారా లేదంటే మరే కారణంతో చనిపోయారు అనే విషయాన్ని సదరు శాస్త్రవేత్తల బృందం క్లారిటీగా చెప్పలేదు. కాని వారి డీఎన్‌ఏ లో మాత్రం కరోనా ఉందంటున్నారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తి కొన్నాళ్ల తర్వాత కోలుకుని కరోనా ఫ్రీ అయినట్లుగా అనిపించినా కూడా అతడి డీఎన్‌ఏలో ఏదో ఒక చోట కరోనా దాగి ఉంటుందని.. అది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా గుర్తించేలా ఉంటుందని అంటున్నారు. డీఎన్‌ఏ లో ఉన్న కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి అధ్యయనం సాగుతుందని కూడా వారు చెప్పుకొచ్చారు. చైనాలో అప్పట్లోనే కరోనా ఉందంటే.. అదే కారణం వల్ల ఇప్పుడు కూడా అక్కడే పుట్టి ఉంటుందని కొందరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. మరో వైపు చైనా లో సహజంగా కరోనా వైరస్ పుట్టిందా లేదంటే ల్యాబ్‌ లో సృష్టించారా అనే విషయాన్ని అమెరికా సహా పలు దేశాలు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.