Begin typing your search above and press return to search.
ఆ మందులతో కరోనా పెరుగుతుంది ... ఐసీఎంఆర్ హెచ్చరిక !
By: Tupaki Desk | 28 April 2021 9:30 AM GMTదేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజు దేశంలో కొన్ని లక్షల కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో తగినన్ని బెడ్లు లేవు, ఒకవేళ ఆసుపత్రుల్లో బెడ్లు దొరికినా, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి యథేచ్ఛగా మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు.
కరోనా భయంతో వైద్యుల సలహా లేకుండా ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారు. ఇలాంటి మందులు ఏ మాత్రం మంచిది కాదని, అవసరం లేని మందులు వేసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం మరింత ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశంతో కరోనా ప్రమాదం మరింత తీవ్రమవుతుందని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ తో పాటు ఇతర మందులు విక్రయించి వేసుకోవడం వల్ల ఇంకా కరోనా ప్రమాదం పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది.
పెయిన్ కిల్లర్స్ కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఇటువంటి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం గుండె, రక్తపోటు సమస్య ఉన్న బాధితులకు మరింత ప్రమాదకరమని, మూత్రపిండాలను దెబ్బతీసే ముప్పు ఉంటుందని గతంలోనూ వైద్య నిపుణులు హెచ్చిరించిన సంగతి తెలిసిందే. కరోనా రోగులు నాన్-స్టెరాయిడల్, యాంటీ-ఇన్‌ఫ్లేమేటరీ మందులను వాడొద్దని, అవసరమైతే పారాసిటమాల్ వేసుకోవాలంటూ ఐసీఎంఆర్ సూచించింది. డయాబెటిస్ ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని..వారికి కరోనా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాబట్టి కరోనా సోకుతుందేమో అన్న భయంలో ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే ఆ మందులు వాడకుండా...వైద్యుల సలహా మేరకు మందులు వాడి, సమయానికి మంచి ఆహారం తీసుకుంటే కరోనా సోకినా కూడా పెద్దగా అవస్థలు పడకుండా బయటపడొచ్చు.