Begin typing your search above and press return to search.

మోడీ రక్షణ కోసం కరోనా సోకని యువ పోలీసులు !

By:  Tupaki Desk   |   1 Aug 2020 2:30 PM GMT
మోడీ రక్షణ కోసం కరోనా సోకని యువ పోలీసులు !
X
అయోధ్య లో ఆగస్టు 5 న ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టానికి తోలి అడుగు పడబోతోంది. గత కొన్నేళ్లుగా కోర్టులో ఉన్న అత్యి పెద్ద సమస్యని సామరస్యంగా పరిష్కరించిన బీజేపీ ప్రభుత్వం అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతుంది. స్వయంగా దేశ ప్రధాని మోడీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో జరిగే అతి పెద్ద వేడుక కావడంతో స్వయంగా సీఎం రంగంలోకి దిగి పనులని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కేవలం ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందించిన అయోధ్య ట్రస్ట్.

ఇకపోతే, ప్రధాని మోడీ రాబోతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు పలు భద్రతా పరమైన చర్యలు కూడా పటిష్టంగా చేపట్టింది. ముఖ్యంగా కరోనా ను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆలయ పూజారితో పాటు 16 మంది డ్యూటీ పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో కరోనా ప్రోటాకాల్ ‌ను కఠినంగా అమలు చేయాలని యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కోసం భద్రత కోసం 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, కరోనా నెగిటివ్ ఉన్న పోలీసు సిబ్బందిని ఆయన చుట్టూ మోహరించనున్నారు. వారికి కరోనా-19 ప్రోటోకాల్‌పై ఇప్పటికే అధికారులు బ్రీఫింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అలాగే , భూమి పూజ జరిగే రోజు అక్కడ ఐదుగురు మించి గుంపులుగా చేరకుండా చూసుకోవాలని అధికారులని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మోదీ పర్యటన సమయంలో ట్రాఫిక్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు 12 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ను మళ్లించనున్నారు. భూమిపూజ కార్యక్రమం సజావుగా సాగేందుకు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు 3,500 నుంచి 4,000 మంది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపారు. ఉత్తరప్రదేశ్ ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ , సీఏపీఎఫ్ సిబ్బంది ఇందులో ఉన్నారు. నిఘా, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు యూపీ పోలీస్ సీనియర్ అధికారులు ఇప్పటికే అయోధ్యని తమ చేతుల్లోకి తీసుకున్నారు.