Begin typing your search above and press return to search.
కరోనా సోకకపోయినా.. వారి పై ప్రభావం మొదలైంది!
By: Tupaki Desk | 19 March 2020 11:30 PM GMTవైరస్ గా ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది కరోనా. ఇప్పటికే చాలా మంది ప్రాణాలను తీసింది ఈ వైరస్. ఆ పై ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యే పరిస్థితి తలెత్తుతూ ఉంది. కరోనా ను నివారించాలంటే ఎక్కడి వారు అక్కడ ఉండిపోవడం ఒక ఉత్తమమైన మార్గం అని ప్రభుత్వాలు తేల్చాయి. కరోనాకు వ్యాక్సిన్ ను కనుగోనే వరకూ ఎవరికి వారు ఉండట మంచిదని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ను ఇచ్చాయి కంపెనీలు.
అయితే ఎక్కడి వారు అక్కడ ఉండిపోతూ ఈ ప్రపంచం మనుగడ సాగించడం కష్టం. ఇళ్ల నుంచి పని చేస్తే చేయవచ్చు.. అయితే మనుషుల రవాణా మీద, మనుషులు బయట తిరగడం మీద ఆధారపడి పని చేసే పరిశ్రమలు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో విమానయాన పరిశ్రమ కూడా ఒకటి. మనుషులు ఎంతగా తిరిగితే విమానయాన సంస్థలకు అంత లాభం. అది కూడా దేశాలకూ, దేశాలకూ తిరిగే మనుషులే ఈ సంస్థలకు కావాల్సింది.
అయితే ప్రస్తుతం అన్ని దేశాలూ తమ తమ సరిహద్దులను మూసేస్తూ ఉన్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం కావడం ఇప్పుడు కష్టం అయిపోయింది. ఏ దేశం వాళ్లు ఆ దేశానికి వెళ్లాలంటేనే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం తమ గగనతలాలను మూసేసినంత పని చేస్తూ ఉంది. పక్క దేశాల నుంచి వచ్చే వారి వల్లనే కరోనా ఎక్కువగా సోకుతున్న నేపథ్యంలో.. ఈ పరిస్థితులు దాపురించాయి. దీంతో విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంది.
ఇప్పటికే చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు తమ విమానాలను ఆపేశాయట. ఎక్కడికక్కడ వాటిని ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశాల మధ్యన తిరిగే వాళ్ల సంఖ్య తగ్గిపోవడంతో.. ఆక్యుపేషన్ లేక విమానాలను నడపడం లేదు. అసలే విమాయన సంస్థలకు లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టున్నాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది జీతభత్యాల కోతను మొదలుపెట్టాయి ఆ సంసంస్థలు. ఇప్పటికే ఇండిగో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ సంస్థ చైర్మన్ పాతిక శాతం జీతాన్ని త్యాగం చేస్తున్నాడట. ఇక ఉద్యోగులందరి జీతాలు కూడా పది నుంచి ఇరవై శాతం వరకూ కోసేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. వీలైనంత త్వరగా కరోనా భయాలు తగ్గాల్సిన అవసరం ఉంది.