Begin typing your search above and press return to search.

కరోనా థర్డ్ వేవ్ తో పిల్లలకి పెను ముప్పే !

By:  Tupaki Desk   |   11 May 2021 2:30 PM GMT
కరోనా థర్డ్ వేవ్ తో పిల్లలకి పెను ముప్పే !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నా కూడా , గత కొన్ని రోజులతో పోల్చితే రెండు రోజులుగా కొంతమేర కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండగా, బాధితుల సంఖ్య మాత్రం తగ్గుతూవస్తుంది. సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కని పరిస్థితి ఉంటే, థర్డ్ వేవ్ ఇంకా ప్రమాదకరంగా ఉండబోతుంది అనే అంచనాలు ఇప్పుడు మరింత ఆందోళనకి గురిచేస్తుంది. ముఖ్యంగా మూడవ దశలో పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ వేవ్‌ లో ప్రభుత్వ లెక్కలు ప్రకారం ఒక్క శాతం కంటే తక్కువ మంది పిల్లలకు కరోనా సోకగా సెకండ్ వేవ్‌ లో, మాత్రం పిల్లలలో సంక్రమణ రేటు 10 శాతం వరకు పెరిగింది. పిల్లలు ఇంకా వ్యాక్సిన్ కూడా పొందలేదు.

దీనిని బట్టి చూస్తే పిల్లలకే 80శాతం వరకు ప్రమాదం థర్డ్ వేవ్‌ లో ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడడం కరోనా రాకుండా ఉండడానికి ముఖ్యమైన అంశాలు కాగా వారికి ఆ నిబంధనలు అర్థం చేసుకునేంత మెచ్యురిటీ కూడా ఉండదని, అటువంటి పరిస్థితిలో కరోనా వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మే చివరివరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫస్ట్ వేవ్‌ లో ఉన్నప్పుడే సెకండ్ వేవ్ గురించి వైరాలజీ నిపుణులు హెచ్చిరించినా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్‌లో మరణాలు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మరణాల శాతం బాగా పెరిగిపోయింది. సాధారణంగా వైరస్ ప్రభావం ఎనిమిది వారాల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం , మే చివరివరకు ఈ వేవ్ ప్రభావం తగ్గుతుంది. మాస్కులు పెట్టుకోకపోవడం, గుంపులుగా చేరడం రాజకీయ ర్యాలీలు, కుంభమేళాలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని పెంచాయి. మూడవ వేవ్ మాత్రం , ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే, స్కూళ్లు ఓపెన్ చేసినట్లైతే పిల్లలు ప్రమాదంలో పడవచ్చు అని అంటున్నారు. వచ్చే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడోదశ పొంచి ఉండగా.. ఈలోపు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌లు వేయాలని నిపుణులు అంటున్నారు.