Begin typing your search above and press return to search.

కరోనా కొత్త హైబ్రిడ్ రకం.. చాలా డేంజర్ అట

By:  Tupaki Desk   |   30 May 2021 3:40 AM GMT
కరోనా కొత్త హైబ్రిడ్ రకం.. చాలా డేంజర్ అట
X
కరోనా మనల్ని వీడిపోయేలా లేదు. మొదటి , రెండో వేవ్ అంటూ విరుచుకుపడుతోంది. జపాన్ లో 4వ వేవ్ వచ్చి అతలాకుతలం అవుతోంది. ఇప్పట్లో ఇది మనల్ని దూరం అయ్యేలా లేదు. రోజూ లక్షలమందిని కబళిస్తోంది.

కరోనా రోజురోజుకు రూపం మార్చుకుంటోంది. ప్రపంచంలోని దేశాల్లో విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పుడు మరో హైబ్రిడ్ రకం కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం అని నిపుణులు తేల్చారు. అంతర్జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

వైరస్ లు రోజురోజుకు రూపు మార్చుకొని మనపై విరుచుకుపడుతాయి. అది దాని లక్షణం. మారిన వైరస్ మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. ఇప్పుడు దేశంలో మారిన కరోనా నే సెకండ్ వేవ్ కు కారణమైంది.

అయితే తాజాగా రెండు కరోనా రూపు మారిన రకాల నుంచి జన్మించిందే ఈ హైబ్రిడ్ రకం కొత్త కరోనా రకం అని నిఫుణులు తేల్చారు. ఇది కరోనా వేరియంట్లలోనే అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రకం తొలి వైరస్ ను తాజాగా వియత్నంలో కనుగొన్నారు. ఈ కొత్త హైబ్రిడ్ రకం కరోనాను అడ్డకట్ట వేయడం కష్టంగా మారిందని వియత్నం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వియత్నాంలోని 63 నగరాల్లో ఇది విలయతాండవం చేస్తోంది. అనేకమంది ఈ వైరస్ తో ప్రభావితం అయ్యారని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థకు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఈ హైబ్రిడ్ రకం వైరస్ అన్ని రకాల కంటే వేగంగా వ్యాపిస్తోందని.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే లక్షణం ఈ హైబ్రిడ్ కు ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ రకం వల్ల ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.