Begin typing your search above and press return to search.
చైనా లో మృత్యు ఘోష ... రోజు రోజుకి విజృంభిస్తున్న కరోనా !
By: Tupaki Desk | 30 Jan 2020 6:38 AM GMTప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ వైరస్ భారిన పడిన చైనా మరింత అతలాకుతం అయ్యింది. చైనాలో ఒక్కరోజే 50 మంది మరణించారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం నాటికి 170 మంది మరణించారు. మరో 7,700 మందిలో వైరస్ లక్షణాలు కనిపించనట్టు తెలుస్తుంది. దీనితో వారిని వివిధ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.వైరస్ సోకినట్టు గుర్తించిన వారిలో 1370 మంది పరిస్థితి ఆందోొళనకరంగా ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కొత్తగా మరో 1700 మంది వైరస్ లక్షణాల తో ఆసుపత్రుల్లో చేరారు. కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది అని తెలిపింది.
వైరస్‌ను నియంత్రించడానికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. వుహాన్ సిటీకే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం 17 నగరాలకు వ్యాపించింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో సుమారు వంద కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వందమంది రక్త నమూనాలను పరిశీలించగా.. అది పాజిటివ్‌గా తేలింది. రాజధాని బీజింగ్‌లో కొత్తగా మరో 111 కేసులు అక్కడి డాక్టర్లు గుర్తించారు. వారిని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్‌ను నయం చేయడానికి అవసరమైన మందులు ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక్క హ్యూబే ప్రావిన్స్‌లోనే 160 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీ ఉన్నది ఈ ప్రావిన్స్‌లోనే వుహాన్ సిటీ సహా ఈ ప్రావిన్స్‌లోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్ చుట్టబెట్టింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య కూడా ఈ ప్రావిన్స్ లోనే అధికం గా నమోదైంది.