Begin typing your search above and press return to search.
మహిళా దేశాధినేతలున్న దేశాల్లో కరోనా అంత తక్కువట
By: Tupaki Desk | 13 April 2020 4:30 AM GMTఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్లిపోతోంది కరోనా. ఈ మహమ్మారికి ఉన్న మంచి లక్షణం ఏమంటే.. దానంతట అది మనిషి వద్దకు వెళ్లదు. బాధ్యత మరిచిన మనిషి దాని వద్దకే వెళ్లి.. తగులుకుంటారు. తాము తగులుకున్నామా? అన్న విషయం తెలిసే లోపే శరీరంలోకి వెళ్లి తిష్ఠ వేస్తుంది. అది మొదలు.. ఒకరి తర్వాత ఒకరికి అంటుకుంటూ రోజుల్లోనే లక్షలాది మందిలోకి ఎక్కేసి.. చుక్కలు చూపిస్తుంటుంది. అలాంటి కరోనాను కంట్రోల్ చేసిన కొన్ని దేశాల విషయానికి వస్తే.. ఒక కామన్ పాయింట్ ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అమెరికా.. స్పెయిన్.. ఇటలీ.. ఫ్రాన్స్.. జర్మనీ.. దేశాల పేర్లు చెప్పినంతనే కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా మారటం తెలిసిందే. ఈ దేశాల్లో లక్షలాది కేసులు నమోదు కావటమే కాదు.. వేలాది మంది మరణించారు. కరోనా ముందు వరకూ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న ఈ దేశాలు ఇప్పుడు ఆగమాగం కావటమే కాదు.. దీని నుంచి ఎప్పుడు బయటపడతామా? అన్న క్వశ్చన్ కు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్.. ఫిన్ లాండ్.. ఐస్ లాండ్.. బెల్జియం.. డెన్మార్క్ లాంటి దేశాల విషయానికి వస్తే..ఆయా దేశాల్లో కరోనా తీవ్రత పెద్దగా లేదనే చెప్పాలి.
ప్రపంచంలోని 190 దేశాలకు పైనే చుట్టేసిన కరోనా కొన్ని దేశాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. తీవ్రత తక్కువగా ఉన్న దేశాల్లో కామన్ పాయింట్ ఏమంటే.. దేశాధ్యక్ష స్థానంలో కానీ ప్రధాని స్థానంలో కానీ మహిళలు ఉండటం. కరోనాను కంట్రోల్ చేయటంలో మహిళాధినేతలు ముందున్నారన్న విషయం ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. 39 ఏళ్ల ఆమె కరోనా విషయంలో కొత్త ఫిలాసఫీ చెబుతుంటారు. యాక్ట్ లైక్ యు హావ్ కరోనా వైరస్ అని చెప్పేస్తారు. కరోనా ఎవరి తలుపు కొట్టదు.. దాని దగ్గరకు మీరు వెళ్లకుంటే అది మీ దగ్గరకు రాదన్న మాటను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. ఆ దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు తమ దేశంలోకి వచ్చినంతనే విమానాశ్రయం నుంచి నేరుగా ఐసోలేషన్ కు పంపిన తొలి దేశం న్యూజిలాండ్ కావటం గమనార్హం.
బెల్జియం ప్రధాని సోఫీ విల్మేస్. 45 ఏళ్ల వయసులో దేశాధ్యక్షురాలైన ఆమె కరోనా మరణాలు పదికి చేరుకున్న వెంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. దేశ జనాభా హైదరాబాద్ మహానగరం కంటే తక్కువే అయినా.. లాక్ డౌన్ వేళ ఆమె తన ప్రసంగంలో తానేం చేయనున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. లాక్ డౌన్ అవసరం లేదు. కానీ.. కొన్ని జాగ్రత్తల్లో భాగంగా తీసుకుంటున్నాం. అత్యవసరమైతే తప్పించి ఇళ్లల్లో నుంచి బయటకు రాకండన్న ఆమె.. ఫారిన్ టూర్లనుబంద్ చేయాలని కోరారు. ఆమె మాటలు దేశ ప్రజల మీద ప్రభావాన్ని చూపటమే కాదు.. తక్కువ వ్యవధిలోనే కరోనా మరణాల్ని కంట్రోల్ చేయగలిగారు.
మరో దేశాధ్యక్షురాలు సనా మారిన్. కోటి యాభైఆరు లక్షల జనాభా ఉన్న ఫిన్ ల్యాండ్ కు ఆమె ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. కరోనాను కంట్రోల్ చేయటంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసు ప్రధానమంత్రి బాధ్యతల్ని చేపట్టిన సనా.. కరనాను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతో ఆ దేశంలో మరణాలు తక్కువగా నమోదయ్యాయి.
మహిళా ప్రధానులు ఉన్న ఐస్ లాండ్ (కత్రిన్).. డెన్మార్క్ (మ్యాటీ ఫ్రెడ్రిక్ సన్) లోనూ కరోనాను కంట్రోల్ చేయటంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. లాక్ డౌన్ కష్టాలు ప్రజల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అత్యవసర ఆర్థిక నిల్వల్ని పోగేయటం గమనార్హం. మహిళలు దేశాధ్యక్షురాలిగా.. ప్రధాన మంత్రులుగా ఉన్న దేశాల్లో కరోనాను కంట్రోల్ చేయటంలో సక్సెస్ కావటం ఆసక్తికరంగా మారింది.