Begin typing your search above and press return to search.

స్పెయిన్ కొంప ముంచిన చైనా కిట్స్.. మరణ మృదంగం

By:  Tupaki Desk   |   27 March 2020 11:30 PM GMT
స్పెయిన్ కొంప ముంచిన చైనా కిట్స్.. మరణ మృదంగం
X
ప్రపంచవ్యాప్తంగా ఇటలీ తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు స్పెయిన్ లో నమోదవుతున్నాయి. మరో ఇటలీ లా స్పెయిన్ మారుతోంది. స్పెయిన్ లో కరోనా టెస్టులు చేయడంలో వైద్యులు చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

స్పెయిన్ లో కరోనా టెస్టుల్లో 30శాతం మాత్రమే కచ్చితమైన రిపోర్టులు వస్తున్నాయంటున్నారు. స్పెయిల్ లాబోరేటరీలు ఈ టెస్టులు చేయడంలో విఫలమవుతున్నాయని గురువారం స్పెయిన్ హెల్త్ ఎమర్జెన్సీ డైరెక్టర్ ఫెర్నాండో సీమోన్ వాపోయారు. 9వేల టెస్టుల్లో సంతృప్తికరంగా లేవని తెలిపారు.

స్పెయిన్ లో కరోనా టెస్టులు చేసేందుకు సరిపడా ఎక్విప్ మెంట్ పరికరాలు ప్రభుత్వం కల్పించడం లేదు. దీంతో మార్చి 26నాటికి 4వేల మరణాలు సంభవించాయి. చైనీస్ బయో టెక్నాలజీ కంపెనీ నాసిరకం కిట్స్ అందజేయడంతో వాటితో చేయడంతో సరిగా టెస్టులు రాక ఈ మరణాలు సంభవించాయి.

స్పెయిన్ దేశం పరీక్షలు నిర్వహించేందుకు గాను కరోనా కిట్స్ ను చైనా, దక్షిణ కొరియా నుంచి 6 లక్షల 40వేల కిట్స్ కొనుగోలు చేసింది. చైనా నుంచి వచ్చిన మెడికల్ పరికరాలు సరిగా పనిచేయడం లేదని స్పెయిన్ ఆరోపించింది. ఈ కిట్ లతో పరీక్షలు చేయలేకపోతున్నామని స్పెయిన్ మెడికల్ బోర్డు చేతులెత్తేసింది.

దీంతో ఇటలీ తర్వాత స్పెయిన్ లో టెస్టులు నిర్ధారణ కాక చాలా మంది మరణిస్తున్నారు. దీనికంతటికి చైనా నుంచి దిగుమతి అయిన నాసిరకం కిట్స్ అని స్పెయిన్ ఆరోపిస్తోంది.