Begin typing your search above and press return to search.

కరోనా-లాక్ డౌన్.. వీళ్లను వదిలేస్తే బెటరేమో?

By:  Tupaki Desk   |   24 April 2020 4:30 AM GMT
కరోనా-లాక్ డౌన్.. వీళ్లను వదిలేస్తే బెటరేమో?
X
కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల దేశం మొత్తం ఇళ్లలో బందీ అయిపోయింది. మొదటి విడత ఏప్రిల్ 14వరకు అందరూ స్టిక్ట్ గా లాక్ డౌన్ పాటించారు. ఇక కేసులు పెరగడంతో రెండో విడతను జనాలు యాక్సెప్ట్ చేశారు. మే 3 వరకు పాటిస్తామంటున్నారు. కానీ ఇప్పుడు జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు ప్రతిపాదన రావడాన్ని జనాలు అస్సలు జీర్ణించుకోవడం లేదు.

ఇప్పటికే నెలరోజులకు పైగా ఇంటికి పరిమితమైన ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన కూలీలు, పేదలు, సగటు మధ్యతరగతి వారికి డబ్బుల కొరత ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొందరు మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారు. అయితే కరోనా తో ప్రాణభయంతో ఉగ్గబట్టుకొని ఉన్నా భవిష్యత్ ను చూస్తే అందరిలోనూ భయం వేస్తోంది. ఉద్యోగాలు కోల్పోయి... తినడానికి తిండి లేక ఆకలి కేకలు పెట్టడం ఖాయమన్న ఆందోళన అంతటా నెలకొంది.

నిజానికి దేశమంతా లాక్ డౌన్ చేయడం కరెక్ట్ కాదన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే దేశంలోని సగం జిల్లాల్లో అసలు కరోనా వైరస్ లేదు. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్ సహా మేఘాలయ, మిజోరం , నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లోనూ కరోనా అస్సలు ఉనికే లేదు. ఇక ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక తెలంగాణలోనూ వరంగల్ రూరల్ వంటి పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు.

ఇలా దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టేకంటే రెడ్ జోన్లు, కరోనా తీవ్రత ఉన్న జిల్లాలకు లాక్ డౌన్ చేసి మిగతా కరోనా లేని జిల్లాలను ఫ్రీ చేస్తే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం జిల్లాల ప్రాతిపదికన కరోనా లాక్ డౌన్ విధిస్తే బెటర్ అన్న డిమాండ్ తెరపైకి వస్తోంది.

తెలంగాణలో హైదరాబాద్ లో కరోనా కేసులు బయటపడుతున్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాలలో కొత్తగా వెలుగుచూశాయి. కరీంనగర్ లో మొదట వెలుగుచూసి ఇప్పుడు సున్నా అయ్యాయి. దీంతో కరోనా లేని ప్రాంతాల్లో జనజీవనానికి మినహాయింపునిస్తే వారి ఉపాధికి కాస్త వెసులుబాటునిచ్చినట్టు అవుతుంది. అన్నింటికి అనుమతులు ఇవ్వకుండా సోషల్ డిస్టేన్స్ పాటించేలా పలు ఉద్యోగ, ఉపాధి రంగాలకు ఇవ్వాలంటున్నారు.

ఇక కేంద్రం కూడా మే 3 తర్వాత కరోనా తీవ్రత ఉన్న జిల్లాలను బేస్ చేసుకొని లాక్ డౌన్ ను మినహాయించాలనే వాదనను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. లేదంటే ఇలాగే అందరికీ కొనసాగిస్తే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమంటున్నారు. తీవ్రత ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టి లేని ప్రాంతాలకు మినహాయింపులివ్వాలనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.