Begin typing your search above and press return to search.

కరోనా పోరాటంలో ముందడుగు..స్వదేశీ వ్యాక్సిన్ సిద్ధం

By:  Tupaki Desk   |   3 May 2020 12:10 PM GMT
కరోనా పోరాటంలో ముందడుగు..స్వదేశీ వ్యాక్సిన్ సిద్ధం
X
వ్యాక్సిన్, మందు ఈ రెండూ లేని కారణంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తోంది. 30 లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసి సుమారు 3 లక్షల మంది ప్రాణాలను గాల్లో కలిపేసిన ఈ మహమ్మారికి మందు కనిపెట్టి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచంలో ప్రతి దేశం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే యూరప్ - చైనాలు దీనికి సంబంధించిన వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కూడా ఈ విషయంలో ముందుడుగు వేసింది. అనేక పరిశోధనల అనంతరం ఎం.డబ్ల్యు. వాక్సిన్ (MW Vaccine) కరోనాను ఎదుర్కొని అంత చేయగలదని భారత పరిశోధకులు తేల్చారు. దీనిపై ఇప్పటికే సేఫ్ట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే టీబీ - సెప్సిస్ వంటి వ్యాధులకు వినియోగిస్తున్నారు. మంచి ఫలితాలు కూడా ఇచ్చిన మందు ఇది. దానిని మరింత అభివృద్ధి చేసిన కరోనాపై క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమయ్యారు.

తొలి దశలో 40 మంది రోగులపై దీనిని ప్రయోగించి చూస్తామని పీజీఐఎంఈఆర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జ‌గ‌త్ రామ్ వెల్లడించారు. దీనిని ఢిల్లీలోని ఎయిమ్స్‌ - భోపాల్‌ - పీజీఐ చండీగ‌ఢ్‌ ల‌లో రోగుల‌పై ప‌రీక్షించ‌నున్నారు. ఇది విజయవంతం అయ్యాక రెండో దశలో మరింత ఎక్కువ మందిపై ప్రయోగిస్తారు. వీటన్నిటికి ఐసీఎంఆర్ అనుమతి అవసరమవుతుంది. ఇది ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న పరిశోధనే కాబట్టి అనుమతులు కూడా వెంటనే రానున్నాయి. మరోవైపు మనదేశం ఇప్పటికే మనదేశం కరోనా ట్రీట్ మెంట్ కు పనికొచ్చే మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ఫార్మా రంగంలో ఎంతో పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కనుగొనడంలో కూడా విజయవంతం కాగలదన్న ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా... ఇపుడు మనం వ్యాక్సిన్ ప్రయత్నాల్లో ఉన్నాం. కనుక్కున్నాక కూడా వెంటనే అందుబాటులో రాదు. ఎందుకంటే ప్రపంచంలోని 700 కోట్ల మందికి అన్ని వ్యాక్సిన్ లు తయారుకావాలి. అందుకే వ్యాక్సిన్ తో పాటు దీనిని ట్రీట్ చేసే మందుల విషయంలో కూడా అమెరికా - తదితర దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ కనిపెట్టిన రెమెడిసివిర్ అనే మందు 4-11 రోజుల్లోనే కరోనాను నయం చేస్తోందని అమెరికా గుర్తించింది. ఇప్పటికే వెయ్యి మందిపై ప్రయోగించింది. ఫలితాలు బాగున్నాయి. దీంతో ఇది కూడా ప్రపంచానికి మంచి వార్తే.