Begin typing your search above and press return to search.

మీకు తెలుసా.. ఈ మొక్కతో కరోనా మటుమాయం!

By:  Tupaki Desk   |   18 Jan 2022 6:12 AM GMT
మీకు తెలుసా.. ఈ మొక్కతో కరోనా మటుమాయం!
X
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. అగ్రరాజ్యం చిన్న దేశం అనే తేడా లేకుండా గడగడలాడిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పటివరకు రకరకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మరోవైపు టీకాయేతర ఔషధాలపై కూడా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఐఐటీ శాస్త్రవేత్తలు ఓ మొక్కతో వైరస్ ను నిర్మూలించవచ్చని గుర్తించారు.

కరోనా వైరస్ ను ఎదుర్కొనగలిగే ఫైటో కెమికల్స్ ఓ మొక్కలో ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీనిని శాస్త్రీయంగా పరిశీలించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సినే తర ఔషధాల్లో ఈ ఫైటోకెమికల్స్ కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఆ మొక్కలు మాత్రం ఎక్కడపడితే అక్కడ దొరకవని చెప్పారు. హిమాలయాల్లోనే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో వాటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వాస్తవానికి హిమాలయాల్లో ఔషధ గుణాలు కలిగిన ఎన్నో మొక్కలు ఉన్నాయనే విషయం అందరికీ తెల్సిందే. శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం అక్కడ అద్భుతమైన ఔషధ మొక్కలను గుర్తిస్తారు. అందులో భాగంగానే టీకాయేతర పరిశోధనల కోసం ఐఐటీ శాస్త్రవేత్తలు బృందం హిమాలయాల్లో పరిశోధనలు జరిపింది. అక్కడ ఓ మొక్కలో ఫైటో కెమికల్స్ ను గుర్తించింది. ఈ మొక్కపై మరిన్ని పరిశోధనలు చేసి... ఫలితాలను పూర్తిస్థాయిలో వెల్లడిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.


కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేవయచ్చునని చెబుతున్నారు. అయితే మహమ్మారి ఎదుర్కొవడానికి పరిశోధనలు ముమ్మరంగా జరుగుతుండగా... మరోవైపు వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. దేశంలో టీకా పంపిణీకి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి రెండు డోసులు పూర్తయ్యాయి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రికాషన్ డోసును ఇస్తున్నారు. గతకొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో 2లక్షలకు పైగా పాజిటివ్ కేసులు.