Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా విలయం: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 4 May 2021 3:30 PM GMTఏపీలో కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీలో కరోనా పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
గంటన్నరపాటు సుధీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆక్సిజన్ బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, డ్రగ్స్, వ్యాక్సినేషన్ పై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఆక్సిజన్ నిల్వలు ఎలా ఉన్నాయి? ఎంతమేరకు సరిపోతాయి.? ఏయే పాయింట్స్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. చనిపోయిన రోగుల దహనం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించింది.
ఇక అడ్మిషన్లు పెరుగుతున్న నేపత్యంలో ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి ఎలా ఉందని ప్రభుత్వాన్ని అడిగింది. టెస్టుల రిపోర్టులు ఎంత సమయంలో అదిస్తున్నారో తెలుపాలన్న కోర్టు.. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది? ఎంత వ్యాక్సిన్ ఉందనే దానిపై విచారణ జరిపింది. ఎంతమందికి వేశారు అని అవసరం ఎంత ఉందని ప్రభుత్వాన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసు తదిపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.