Begin typing your search above and press return to search.

ఆ స్పీకర్ సంచలనం..చైనా వస్తువులతో వస్తే సభలోకి నో ఎంట్రీ!

By:  Tupaki Desk   |   18 Aug 2020 11:30 AM IST
ఆ స్పీకర్ సంచలనం..చైనా వస్తువులతో వస్తే సభలోకి నో ఎంట్రీ!
X
ఆసక్తికర వ్యాఖ్య చేశారు హర్యానా రాష్ట్రఅసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా. కరోనా మహమ్మారితో సహజీవనం చేయటం మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వాలు.. నెమ్మదిగా పాలనా పరమైన నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి. షెడ్యూల్ లో భాగంగా నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. ముఖ్యమైన సదస్సుల్ని వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో కరోనా ఒక కొలిక్కి రాదన్న విషయాన్ని గుర్తిస్తూ.. అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.

హర్యానా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనల్ని పెట్టాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర స్పీకర్. ఇందులో భాగంగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా ఎవరూ అసెంబ్లీ పరిసరాల్లోకి అడుగుపెట్టకూడదని స్పష్టం చేశారు.
మీడియా సిబ్బందితోపాటు..అధికారులు.. భద్రతా సిబ్బంది..ఎమ్మెల్యేలు మంత్రులు.. చివరకు ముఖ్యమంత్రి సైతం కరోనా నెగిటివ్ పత్రం తీసుకొస్తే మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టనిస్తామన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. అంతేకాదు.. కరోనా టెస్టు రిపోర్టు ముందు రోజుదే అయి ఉండాలని.. పాతదానితో వస్తే అనుమతించమని చెబుతున్నారు.

అసెంబ్లీలోకి వచ్చేప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ వినియోగించాలని.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చునే చోట శానిటైజర్ తో పాటు.. కరోనా నివారణకు తీసుకునే ఉత్పత్తుల్ని ఉంచుతామని చెబుతున్నారు. అంతేకాదు.. మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. కరోనా లేదన్న నెగిటివ్ సర్టిఫికేట్ తో పాటు.. వారితో తీసుకొచ్చే శానిటైజర్.. మాస్కులు చైనావి అయితే.. అసెంబ్లీలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేయటం గమనార్హం.