Begin typing your search above and press return to search.

అంగట్లో కరోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్లు !

By:  Tupaki Desk   |   27 Oct 2020 5:30 PM GMT
అంగట్లో కరోనా నెగెటివ్ స‌ర్టిఫికెట్లు !
X
క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ వ‌స్తుందా నెగిటివ్ వ‌స్తుందా అని భయపడాల్సిన అవసరం లేదు. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లం. మీకు ఎలాంటి చింత అవ‌స‌రం లేకుండా క్షణాల్లో మీకు క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ ఇస్తాం అంటూ బంప‌ర్‌ ఆఫ‌ర్ ఇస్తోంది బెంగుళూరు లోని ఓ ఆసుపత్రి. ఇలా టెస్టులు చేయకుండానే క్షణాల్లో కొరోనా నెగటివ్ సర్టిఫికెట్ల కోసం .. కేవ‌లం రూ. 1500 నుండి 2,500 రూపాయ‌లు చెల్లిస్తే సరిపోతుంది. అయితే , మ‌నుషుల ప్రాణాల‌తోనే వ్యాపార‌మా అని ఈ విష‌యం తెలిసిన వారు నోరెళ్ల‌బెడుతున్నారు. య‌థేచ్ఛ‌గా న‌కిలీ స‌ర్టిఫికెట్లు జారీ చేస్తున్నా , ఇన్ని రోజులు సంబంధిత అధికారులు ఎందుకు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ప్రస్తుతం దేశంలో కొరోనా జోరు కొనసాగుతుంది. దేశంలో ప్రతిరోజూ కూడా భారీగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే మరణాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. అయితే , కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చినా కూడా ఇప్పటికి కొన్ని ప్రాంతాలకి వెళ్లాలి అంటే కరోనా నెగటివ్ గా ఉన్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి. దీనితో కొంతమంది అడ్డదారులు తొక్కుతూ అమాయకుల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే కువైట్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధనను సొమ్ము చేసుకుంటున్న ఓ ఆసుపత్రి గుట్టు రట్టయింది. బెంగుళూరులోని పొబ్బతి మెటర్నిటీ హాస్పిటల్ ల్యాబ్ లో ఫేక్ కరోనా నెగిటివ్ సర్టిఫికెట్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. 1500 నుండి 2500 మధ్య డబ్బులు వసూలు చేస్తూ , అసలు కరోనా టెస్ట్ చేయకుండానే, క్షణాల్లో ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ తరహా సర్టిఫికెట్టు ఇటీవల దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే , ఈ విదంగా సర్టిఫికెట్స్ ఇచ్చే హాస్పిటల్స్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.