Begin typing your search above and press return to search.

కరోనా కొత్త హాట్ ‌స్పాట్‌.. దేశానికి పొంచి ఉన్న పెను ముప్పు

By:  Tupaki Desk   |   25 Feb 2021 11:30 AM GMT
కరోనా కొత్త హాట్ ‌స్పాట్‌.. దేశానికి పొంచి ఉన్న పెను ముప్పు
X
దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మళ్లీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. అయితే , మహారాష్ట్ర లో కరోనా వైరస్ ఉద్ధృతికి కారణం తెలిసింది. విదర్భ ప్రాంతం కరోనా వైరస్‌ కు హాట్‌ స్పాట్ ‌గా మారింది. విదర్భ రీజియన్ ‌లోని యావత్మాల్, అకోలా, అమరావతి, వార్ధా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి గతేడాది సెప్టెంబర్ లెవల్స్ ‌ను చేరుకున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఆ లెవల్ ‌ను కూడా దాటినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ ‌లో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గరిష్ట దశలో ఉంది. వైరస్ ఉద్ధృతి విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది పుణే, ముంబై లాంటి ప్రాంతాలకు విస్తరిస్తోంది' అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. విదర్భ రీజియన్‌లోని మూడు జిల్లాల్లో పాజిటివ్ రేటు బాగా పెరిగిందని అధికారులు వెల్లడించారు.

ఆదివారం నాటికి యావత్మాల్‌ లో పాజిటివిటీ రేటు 41.4 శాతంగా నమోదైంది. అమరావతి, అకోలా, వార్ధా జిల్లాల్లో ఇది వరుసగా 38%, 29%, 24 శాతంగా ఉంది. నాగ్‌ పూర్‌ నుంచి అమరావతి, ఔరంగాబాద్‌ వరకు వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దీన్ని అక్కడే నియంత్రించకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్రలో 4 నెలల తర్వాత కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 8807 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత ఇదే గరిష్టం. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,21,119కు చేరింది. అయితే.. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతికి కొత్త రకం కరోనా వేరియంటే కారణమా, కాదా అనే విషయంపై స్పష్టత రావాలి.