Begin typing your search above and press return to search.
కరోనా కొత్త వేరియంట్ ‘లాంబ్డా’.. 29 దేశాలల్లో విజృంభణ, మళ్లీ !
By: Tupaki Desk | 28 Jun 2021 5:11 AM GMTకరోనా వైరస్ లో జన్యు మార్పులు జరిగి ప్రపంచాన్ని మరింత ఆందోళనలో పడేస్తోంది. ఇప్పటికే డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్ లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ డెల్టా వేరియంట్ తోనే ప్రస్తుతం కష్టం అనుకుంటున్న సమయంలో తాజాగా లాంబ్డా అనే మరో వేరియంట్ కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ ను తమ దేశంలో గుర్తించినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్లడించింది. గత వారం యూకేలో నమోదయిన మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ కాగా, లాంబ్డా వేరియంట్ కి చెందిన 6 కేసులు కూడా నమోదు అయినట్టు పీహెచ్ ఈ తెలిపింది. కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై పరిశోధన కొనసాగుతోందని పీహెచ్ఈ తెలిపింది. అయితే, పూర్తిస్థాయి రెండు డోస్ ల వ్యాక్సిన్ లంబ్డా వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని పీహెచ్ ఈ వ్యక్తం చేసింది.
లాంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా? అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లును సూచిస్తోంది. లాంబ్డా వేరియంట్ ను తొలిసారి గతేడాది ఆగస్టులో పెరులో గుర్తించారని డబ్ల్యూహెచ్ ఓ ఓ వీక్లీ బులిటెన్ లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని, ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో ఈ వేరియంట్ కేసులు ఉన్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పెరూలో నమోదయిన మొత్తం కరోనా కేసుల్లో 81 శాతం లాంబ్డా వేరియంట్‌కు చెందినవి.. చిలీలో గత రెండు నెలల్లో నమోదయిన కేసుల్లో 32 కేసుల్లో లాంబ్లా వేరియంట్ గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇక, యూకేలో ఇప్పటి వరకూ 35,204 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోల్చితే ఈ వేరియంట్ కేసులు 46 శాతం మేర పెరిగినట్టు పెరిగింది. మొత్తంగా ఈ వైరస్ ఎంతమేర ప్రమాదమో ఇంకా పూర్తిగా తెలియకపోయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కరోనా మహమ్మారి వేరియంట్స్ ను అంత సులువుగా నమ్మడానికి వీల్లేదు.