Begin typing your search above and press return to search.
వాట్సాప్ లో కరోనా కల్లోలం.. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
By: Tupaki Desk | 29 March 2020 4:34 AM GMTవాట్సాప్ ఓపెన్ చేస్తే అన్నీ కరోనా వార్తలే.. కరోనా ఇంత తీవ్రంగా ఉందని కొందరు.. మిరియాలు, శొంటి అల్లం తింటే పోతుందని మరికొందరు.. ఇలా కరోనాపై ఎవరికి నచ్చిన అభూతవార్తలు వారు వ్యాప్తి చెందిస్తున్నారు. కానీ ఇప్పటికీ కరోనాకు మందు కనిపెట్టలేదు. వ్యాధి తగ్గడం లేదు. మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన సోషల్ మీడియా సాక్షిగా వదంతులు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి.
ప్రతీరోజు తెలంగాణ ప్రభుత్వం బులిటెన్ విడుదల చేస్తూ ఎంతమందికి తెలంగాణలో కరోనా సోకిందే వివరణ ఇస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా నిన్న 58మంది బాధితులు తెలంగాణలో చికిత్స పొందుతున్నారని తెలిపాడు. కొత్తగా 10 కేసులు ఒక్కరోజులోనే నమోదయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో రెండో దశ ప్రారంభమైందని రోగుల కుటుంబ సభ్యులు, పక్కన సంచరించిన వారికి వైరస్ సోకిందని కేసీఆర్ తెలిపారు. కమ్యూనిటీ స్ప్రెడ్ ప్రారంభమైందన్నారు.
తాజాగా క్వారంటైన్ లో ఉన్న కరోనా రోగులు నివసించే అపార్ట్ మెంట్లలో ప్రజలు భయంకర పరిస్థితి లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులు సైతం పరిస్థితి అదుపుతప్పిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. చికిత్స చేస్తున్న డాక్టర్లు భారత్ డేంజర్ లో ఉందని 20కోట్ల మంది చస్తారని సోషల్ మీడియాలో భయానక వార్తలను వ్యాపింపచేస్తున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కరోనా సోకిందని.. రెడ్ జోన్లు అందుకే ప్రకటించారని వార్తలు షికారు చేస్తున్నారు. ప్రతీరోజు కరోనా వైరస్ బాధితులపై హెల్త్ బులిటెన్ విడుదల చేసే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సకాలంలో విడుదల చేయడం లేదు. దీంతో ఈ పుకార్లు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.
బులిటెన్ విడుదల చేయకపోతే ఈ పుకార్లకే అంతం లేకుండా పోతుంది. ఇలాంటి ప్రచారాన్ని ఆపాలంటే వెంటనే తెలంగాణ సర్కారు వివరణ ఇచ్చి ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.