Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ 90 శాతానికి చేరుతోన్న .. అదుపులోకి రాని కరోనా !

By:  Tupaki Desk   |   31 Oct 2021 1:30 AM GMT
వ్యాక్సినేషన్ 90 శాతానికి చేరుతోన్న .. అదుపులోకి రాని కరోనా !
X
కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు వేయించుకున్నాం. ఇక మనల్ని కరోనా ఏమీ చేయలేదు అనుకుంటే పొరపాటే, కరోనా మాకు సోకదు అనే ఏమరపాటు వద్దు. ఇది నిజమని సింగపూర్‌ అనుభవం చెబుతుంది. ఈ దేశంలో ఇప్పటికే 84 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతేకాదు వీరిలో 14 శాతం మంది బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నారు. మిగిలిన వారిలో 85శాతం మంది ఒక డోసు వేయించుకున్నారు. వ్యాక్సినేషన్‌ ఇంత బాగా జరిగినా, అక్కడ రోజు రోజుకి కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

దీనితో వారు ఆందోళనకు గురౌవుతున్నారు. ఆ దేశ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 4000 పైగా కేసులు, 16మంది మఅతి చెందినట్లు నమోదయ్యాయి. దేశంలో వందశాతం మందికి టీకాలు వేయించడానికి ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తున్నా కూడా దేశంలో మరోవైపు మళ్లీ కరోనా పెరగడం పై సింగపూర్ ప్రభుత్వం గందరగోళంలో పడింది. ప్రపంచంపై మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వివిధ దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రష్యా, చైనాలో పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనితో ఆయా దేశాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి.

రష్యాపై కొవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం ఒక్క రోజే ఇక్కడ 1,159 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 2.3 లక్షలకు పెరిగింది. బుధవారం ఒక్క రోజే రష్యా వ్యాప్తంగా 40,096 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 84 లక్షలకు చేరింది. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని మాస్కో నగరంలో 11 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.

చైనాలో మొదలైన కరోనా సంక్షోభం.. కొన్ని నెలల పాటు ఆ దేశాన్ని ఆంక్షల చట్రంలోకి నెట్టింది. ఆ తర్వాత ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో విజృంభించింది. ఆ తర్వాత ఆమెరికాలో తన ప్రతాపాన్ని చూపింది. మన దేశంలో సైతం రెండో దశలో కరోనా ఆందోళనకర స్థాయిలో విజృంభించింది. ఈ దశలో దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారింది ఆర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మన దేశంలో మూడో దశ రావచ్చనే ఆంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 24.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 50 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. 22.2 కోట్ల మంది కొవిడ్ను జయించారు.