Begin typing your search above and press return to search.

ఒకవైపు కరోనా..మరోవైపు వర్షం..వణికిపోతున్న బెంగళూరు, మరో 3 రోజులు ఇలాగే ..!

By:  Tupaki Desk   |   24 April 2020 3:30 AM GMT
ఒకవైపు కరోనా..మరోవైపు వర్షం..వణికిపోతున్న బెంగళూరు, మరో 3 రోజులు ఇలాగే ..!
X
దేశం మొత్తం కరనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ అమలు చేశారు. ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తుంటే .. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మరో 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందటూ భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉరుములు, మెరుపులు ఆరంభం అయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ వెంటనే చినుకులుతో ఆరంభమైన వర్షం చూస్తుండగానే కుండపోతగా మారింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.యశ్వంతపుర, మల్లేశ్వరం, రాజాజీ నగర, మెజస్టిక్, చిక్‌పేట, మహాత్మాగాంధీ రోడ్డు, సదాశివ నగర, బీటీఎస్ రోడ్డు వంటి ప్రాంతాలతో పాటుగా .. బెంగళూరు శివార్లలోనూ భారీ వర్షం పడింది.

బెంగళూరు మహానగర పాలికె సిబ్బంది వర్షపునీటిని తోడేసే పనిలో నిమగ్నం అయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య మార్పు వల్ల కరోనా వైరస్ మరంత వేగంగా ప్రబలే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. అలాగే , బెంగళూరుతో పాటు చిక్‌ మగళూరు, కొడగు, శివమొగ్గ, హసన్ వంటి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.