Begin typing your search above and press return to search.
కరోనా మూలాలు.. చైనా గుహ నుంచే వ్యాపించిందా?
By: Tupaki Desk | 26 May 2021 12:30 AM GMTఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి దాదాపు అన్ని దేశాలకు పాకింది. అగ్రరాజ్యం, చిన్న దేశం అనే తేడా లేకుండా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారత్ లో రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. వైరస్ విజృంభణ ప్రారంభమై ఏడాది దాటింది. ఈ మహమ్మారి మూలాలను కనుగొనడానికి పరిశోధకులు ఇంకా ప్రయోగాలు జరుపుతున్నారు.
చైనాలోని వుహాన్ చేపల మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందని ఆ దేశం వెల్లడించింది. అయితే వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ ప్యాప్తి ప్రారంభమైందనే ఆరోపణలు నేటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశంలోని ఓ గుహ నుంచే వైరస్ పుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. యువాన్ ప్రావిన్స్ లోని గుహల నుంచి వైరస్ వుహాన్ కు చేరిందని నిపుణులు భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రపంచమంతా విస్తరించిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యునాన్ లోని గుహల వైపు చైనా ఎవరినీ అనుమతించకపోవడం ఈ అనుమానాలకు అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేవలం పరిశోధకులకు మాత్రమే ఆ గుహల్లోకి వెళ్లడానికి అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. అక్కడి పరిశోధన పత్రాలను నేరుగా టాస్క్ ఫోర్స్ కు సమర్పించాల్సి ఉంటుంది. అటునుంచి అధ్యక్షుడికి దగ్గరకు చేరుతాయని సమాచారం. ప్రపంచాన్ని వణికించే మహమ్మారి ఆ గుహల్లోనే పుట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2002లోనే గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో కొందరు సార్స్ లక్షణాలతో బాధపడ్డారని కథనాలు ప్రచురితం అయ్యాయి. 2012లోనూ యునాన్ ప్రావిన్స్ లో గబ్బిలాల విసర్జితాలను శుభ్రపరిచే క్రమంలో కొందరిలో సార్స్ లక్షణాలను గుర్తించినట్లుగా ఆ దేశ వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచే సార్స్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే కరోనా మూలాల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. వైరస్ మూలాల గుర్తింపు దర్యాప్తులో డబ్ల్యూహెచ్వోకు డ్రాగన్ దేశం సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.