Begin typing your search above and press return to search.
కరోనాకు మన దేశం కలిసొచ్చిందా? 7 వేలకు పైగా రూపాల్లో ప్రజలమీదకి!!
By: Tupaki Desk | 21 Feb 2021 2:30 AM GMTకొన్ని విషయాలు చాలా వింతగా ఉంటాయి. నమ్మశక్యం కావడం కూడా ఒకింత కష్టమే. నిజమా?! అని నోరె ళ్లబెట్టాల్సిన పరిస్థితి!! ఇప్పుడు కరోనా మహమ్మారి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే మనకు దాపురించిం దని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కడో చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని గడగడలాడించి కోట్ల మంది ప్రాణాల ను హరించిన కరొనా వైరస్.. తగ్గిపోయిందని.. దీనికి మనం వ్యాక్సిన్ కూడా కనుక్కున్నామని.. సంబరం చేసుకుంటున్నాం. మాస్కులు తీసేస్తున్నాం.. భౌతిక దూరాన్ని ఎప్పుడో మరిచిపోయాం. బహుశ మన నిర్లక్ష్యాన్ని గమనించిందో ఏమో.. కరోనా.. మరింతగా విజృంభిస్తోంది.
అది కూడా భిన్నమైన రూపాల్లో భారతీయులను టార్గెట్ చేస్తోందట!! మన దేశంలో ప్రస్తుతం 7,569 కరోనా వైరస్ వేరియంట్లను గుర్తించారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి ఇన్ని రకాలు ఉంటాయని దేశంలోని శాస్త్రవేత్తలు కూడా ఊహించలేదు. కానీ, వాస్తవంగా ఇన్ని రూపాల్లో కరోనా విజృంభిస్తోందని అంటున్నారు పరిశీలకులు.. పరిశోధకులు కూడా! హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ పబ్లికేషన్ ప్రకారం.. దేశంలో 7,569 కరోనా రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి.
సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఒక్కరే 5 వేల కరోనా వైరస్ రకాలను, అవి ఎలా ఉద్భవించాయన్న దానిని విశ్లేషించారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతంగా ఉన్నప్పటికీ, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో దాని ప్రభావం కొంత తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఇక, ఈ వేరియంట్లలో రోగ నిరోధకత నుంచి తప్పించుకునే E484K మ్యుటేషన్, N501Y మ్యుటేషన్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వీటిలో కొన్ని రకాలు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొన్నారు.
ఏడాది క్రితం ఒక్కటిగా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు లెక్కలేనన్ని వేరియంట్లుగా మారిపోయిందని డాక్టర్ మిశ్రా తెలిపారు. ఉదాహరణకు A3i వేరియంట్ ఉత్పరివర్తనాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని ఊహిం చారు. అయితే, జూన్ 2020 నాటికి D614G ఉత్పరివర్తనాలను మోస్తున్న, ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న A2a వేరియంట్‌ను ఇది అధిగమించిందని అధ్యయనం ధ్రువీకరించింది.
ప్రపంచవ్యాప్తంగా గతేడాది చాలా కాలం పాటు A2a వేరియంట్ ఆధిపత్యం కనబరించింది. ఇక, ఇప్పుడు మన దగ్గర మాత్రం A3i వేరియంట్ వేగంగా వృద్ధి చెందుతుండడంతో రానున్న రోజుల్లో మరింతగా కరోనా విజృంభించడం ఖాయమని అంటున్నారు. సో.. దీనిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్ధం చేసుకుంటే బెటర్ అంటున్నారు పరిశోధకులు. మరి ఏం చేద్దాం.. జాగ్రత్తగా ఉందామా? దేశాన్ని కరోనా మయం చేద్దామా?!!