Begin typing your search above and press return to search.
నీటి సరఫరా నిలివేయడానికి కారణం చెప్పిన ఫ్రాన్స్ ..ఏంటంటే !
By: Tupaki Desk | 20 April 2020 12:30 PM GMTకరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ వంటి దేశాలపై కరోనా నృత్యం చేస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్న ఫ్రాన్స్ లో ఇప్పటివరకు 19,718 మంది కరోనా భారిన పడి మరణించగా... దాదాపు లక్షన్నర మందికి పైగా ఈ ప్రాణాంతకరమైన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా తీవ్రతని దృష్టిలో పెట్టుకొని మే 11 వరకు లాక్ డౌన్ గడువు పొడిగిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని వీధులను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తున్న నీటిలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పారిస్ వాటర్ అథారిటీ ప్రకటించింది. దీని పై స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ ..రాజధానిలో వివిధ ప్రాంతాల నుంచి 27 నీటి నమూనాలను పరీక్షించగా.. అందులో నాలుగింటిలో కరోనా వైరస్ కు సంబంధించిన సూక్ష్మ ఆనవాళ్లను తమ లాబొరేటరీ గుర్తించిందని తెలిపారు. ఈ నీటిని పార్కులు, వీధులను శుభ్రం చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తామని, తాగునీటి సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటికే నాన్- పాటబుల్ వాటర్ సప్లై నిలిపివేశామని, కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. కాగా సీనీ నది, ఆర్క్యూ కెనాల్ నుంచి సేకరించిన నీటిని ఫౌంటేన్స్ నిర్వహణ, పబ్లిక్ పార్కుల్లో పచ్చదనం పెంచడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నీటిలోకి కరోనా ఆనవాళ్లు ఎలా వచ్చాయి అన్న విషయం మాత్రం ఎంతగా ఆలోచించిన అర్థం కావడం లేదని అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే పైపుల ద్వారా సరఫరా చేసిన నీటి ద్వారా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని విశ్లేషిస్తున్నామని తెలిపారు.