Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో దారుణం..రోడ్డుపై శవంగా క‌రోనా అనుమానితుడు

By:  Tupaki Desk   |   12 April 2020 3:55 PM GMT
హైద‌రాబాద్‌ లో దారుణం..రోడ్డుపై శవంగా క‌రోనా అనుమానితుడు
X
తెలంగాణ‌లో క‌రోనా విజృంభిస్తోంది. ఏకంగా 502కు క‌రోనా కేసులు చేర‌డంతో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా జ‌రిగింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నిరంత‌రం క‌రోనా నివార‌ణ‌పై - లాక్‌ డౌన్ అమ‌లుపై సంబంధిత అధికారులు - మంత్రుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన ఆదేశాలు జారీ చేస్తూ క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో భాగంగా లాక్‌ డౌన్‌ ను ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో క‌రోనాతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఎందుకంటే ఆ వ్య‌క్తి చ‌నిపోయింది హైద‌రాబాద్ న‌డి రోడ్డుపై 12గంట‌ల పాటు ఆ మృత‌దేహం అక్క‌డే ప‌డి ఉంది. దీంతో స్థానిక ప్రాంత‌వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

హైద‌రాబాద్ లాలాపేట‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ల‌గా వారు ప‌రీక్షించి కింగ్‌ కోఠిలోని ప్ర‌భుత ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు చేయించుకున్న 77 ఏళ్ల వృద్ధుడిని గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని వైద్యాధికారులు ఆదేశించారు. ఈ క్ర‌మంలో అత‌డిని అంబులెన్స్‌ లో గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపు మాయ‌మయ్యాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నారయ‌ణ‌గూడ‌లో రోడ్డుపై అత‌డు శ‌వ‌మై క‌నిపించాడు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. బాడీ ప‌రిశీలిస్తున్న క్రమంలో అత‌డి జేబులో ఆస్ప‌త్రికి సంబంధించిన కాగితాలు - బిల్లులు క‌నిపించాయి. ఈ క్ర‌మంలో గాంధీ ఆస్ప‌త్రిలో చేరాల‌ని వైద్యులు రాసిచ్చిన చీటీలు కూడా పోలీసులు ప‌రిశీలించారు.

ఆ చీటీలు చూసి వెంట‌నే క‌రోనా అనుమానితుడిగా గుర్తించి ఆ మృత‌దేహాన్ని అక్క‌డి నుంచి త‌ర‌లించలేదు. ఆ తెల్ల‌వారుజామున ప్ర‌త్యేక క‌వ‌ర్లు తీసుకొచ్చి ఆ మృత‌దేహాన్ని త‌ర‌లించారు. అయితే ఈ క్ర‌మంలో 12గంట‌ల పాటు మృత‌దేహం రోడ్డుపైనే ఉండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఆ మృతుడు నేపాల్‌ కు సంబంధించిన వ్య‌క్తిగా గుర్తించారు. అత‌డి పేరు షేర్ బ‌హ‌దూర్ అని - లాలాపేట‌లోని ఓ బార్‌ లో ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.