Begin typing your search above and press return to search.

ఫిబ్రవరిలో కరోనా పీక్స్.. ఆర్ నాట్ విలువ 4కు చేరిక

By:  Tupaki Desk   |   8 Jan 2022 3:30 PM GMT
ఫిబ్రవరిలో కరోనా పీక్స్.. ఆర్ నాట్ విలువ 4కు చేరిక
X
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో వైరస్ తీవ్రతపై పరిశోధకులు విశ్లేషణ మొదలుపెట్టారు. మూడో వేవ్ మొదలైనట్లేనని అంచనావేస్తున్నారు. గత రెండు వారాల కోవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్ బృందం.. తాజాగా సంచలన విషయాలను వెల్లడించింది.

దేశంలో ఆర్ నాట్ విలువ డిసెంబర్ 25-31 మధ్య 2.9 ఉండగా.. జనవరి 1-6 మధ్య ఏకంగా 4 గా నమోదైందని తెలిపింది. దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ ఆర్ నాట్ విలువ 1.69 గానే ఉండడం గమనార్హం. అంటే ఇప్పుడు వైరస్ తీవ్రత ఇంకా అధికమని తేలింది.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ‘ఆర్ నాట్’గా పేర్కొంటారు. ఈ విలువ ఒకటి దాటం డేంజర్ అని నిపుణులు చెబుతుంటారు.

గత బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ సైతం దేశ ఆర్ నాట్ విలువ 2.69గా ఉందని తెలిపింది. ఇది దేశంలో ప్రస్తుతం వేవ్ చూస్తుంటే.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్టస్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఈ బృందం అంచనావేసింది.

వ్యాక్సినేషన్ రేటు.. మొదటి, రెండో వేవ్ లతో పోల్చితే ఈసారి తక్కువ సామాజిక దూరం పాటిస్తుండడం వంటి కారణాలతో ప్రస్తుత వేవ్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుందని ఐఐటీ నిపుణులు వెల్లడించారు. ఈసారి జనాభాలో 50శాతం మందికి టీకాలు పూర్తికావడం కలిసి వచ్చే అంశమని చెప్పారు.

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి.. ముందు రోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి.