Begin typing your search above and press return to search.

క‌రోనా క‌ల్లోలం: ఒక్క క‌ర్నూల్ జిల్లాలోనే ఎందుక‌న్నీ కేసులు!

By:  Tupaki Desk   |   2 May 2020 12:30 PM GMT
క‌రోనా క‌ల్లోలం: ఒక్క క‌ర్నూల్ జిల్లాలోనే ఎందుక‌న్నీ కేసులు!
X
కరోనా క‌ల్లోలం సృష్టిస్తుండ‌డంతో క‌ర్నూలు జిల్లా గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రెడ్ జోన్‌ ల‌లో క‌ర్నూలు జిల్లా కూడా ఉంది. ఈ ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏకంగా 411 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికార యంత్రాంగం ప‌టిష్టమైన చ‌ర్య‌లు తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం బాధ్యు‌లైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. మొన్ననే క‌ర్నూలు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ పై బ‌దిలీ వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగంలో వ‌ణుకు పుట్టింది. ఇంత‌వ‌ర‌కు బాగానే అస‌లు ఒక్క క‌ర్నూలు జిల్లాలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వ‌డానికి కార‌ణాలేంట‌ని కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో పోలీస్ యంత్రాంగం కూడా ప‌రిశీల‌న చేస్తోంది.

ప్ర‌స్తుతం దాదాపు వెయ్యి మంది కరోనా బాధితులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ఆ రిపోర్టులు వ‌స్తే మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ జిల్లాలో మొత్తం 500-600కు కేసులు చేరుకుంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ జిల్లాలో క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. క‌లెక్ట‌రేట్ నుంచి మొద‌లుకుని పంచాయ‌తీ వ‌ర‌కు అంద‌రినీ త‌న బాధితులుగా చేసుకుంటోంది.

కర్నూలు కార్పొరేషన్‌ లో పనిచేసే ఓ కీలక అధికారితో పాటు అతడి వద్ద పనిచేసే సహాయకుడికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వారు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వారికి కరోనా రావ‌డంతో కర్నూలు కలెక్టరేట్‌ లో జరిగిన‌ సమావేశాలకు హాజ‌రైన వారు - విధులు నిర్వ‌హిస్తున్న వారు భ‌యాందోళ‌న చెందుతున్నారు. త‌మ‌కు క‌రోనా సోకిందేమోన‌ని కొంతమంది స్వచ్చంధంగా ప‌రీక్ష‌లు చేయించుకుంటుండ‌గా మ‌రికొంద‌రు జంకుతున్నారు. అయితే వారిద్ద‌రి ప్రైమ‌రీ కాంటాక్ట్‌లు గుర్తిస్తూ క్వారంటైన్‌ కు త‌ర‌లిస్తున్నారు.

గ‌తంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడుగురు వైద్యులు కరోనా పాజిటివ్ రాగా పీజీ మెన్స్ హాస్ట్‌ల్‌ లో కలకలం రేపుతోంది. పీజీ మెన్స్ హాస్టల్‌ లో పనిచేస్తున్న వ్యక్తికి కూడా పాజిటివ్ వ‌చ్చింది. అతడి ద్వారా మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పీజీ మెన్స్ హాస్టల్‌ లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటారు. దీంతో వారంతా కరోనా భయంతో వణికిపోతున్నారు. వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు స‌మాచారం. రెడ్‌ జోన్‌ గా ప్రకటించడంతో లాక్‌ డౌన్‌ ను ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.