Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ కు 'పాజిటివ్'

By:  Tupaki Desk   |   11 May 2022 4:54 AM GMT
బిల్ గేట్స్ కు పాజిటివ్
X
లేట్ గా అయినా కరోనా ప్రముఖులను వదిలిపెట్టడం లేదు. 60 ఏళ్లు దాటిన వారికి కొంత ఇది ఇబ్బందిగా మారనుంది. ఈ క్రమంలోనే సీనియర్ ప్రముఖులు అంతా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఒకప్పటి ప్రపంచ కుబేరుడు.. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు స్వల్ప స్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. వైద్యుల సలహా మేరకు పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని సంతరించుకునే వరకూ ఐసోలేషన్ లో ఉంటానని బిల్ గేట్స్ తెలిపారు. మనలో ఎవరూ మళ్లీ వైరస్ బారిన పడకుండా సాధ్యమైనంతవరకూ కృషి చేస్తామని బిల్ గేట్స్ తెలిపారు.

ఇక తాను కోవిడ్ టీకాలు తీసుకున్నానని.. బూస్టర్ డోసు వేయించుకున్నానని.. అలాగే అత్తుత్తమ వైద్య సేవలు పొందే అవకాశం ఉండటం అదృష్టం అంటూ బిల్ గేట్స్ వరుస ట్వీట్లు చేశారు.

ఇక కరోనా వైరస్ ప్రబలగానే అందరికంటే ముందు స్పందించింది బిల్ గేట్స్ నే. ఆయన కరోనా టీకాలు అందరికీ అందుబాటులో ఉండాలని.. ముఖ్యంగా పేద దేశాలకు వాటిని అందాల్సిన ఆవశ్యకతపై బిల్ గేట్స్ మొదటి నుంచి తన గళం వినిపిస్తున్నారు. తన వంతుగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారీగా నిధులు వెచ్చిస్తున్నారు.

అమెరికాలో మరోసారి కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది.చైనాలో లాగానే ఇక్కడ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖులు కూడా దీని బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది