Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ అల్లుడికి కరోనా పాజిటివ్!
By: Tupaki Desk | 24 March 2021 4:18 PM GMTఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త, కేసీఆర్ అల్లుడు అనిల్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ''నా భర్త అనిల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో బాగానే ఉన్నారు. మా కుటుంబం మొత్తం క్వారంటైన్ లోనే ఉంది.'' అని కవిత ట్వీట్ చేశారు
అంతేకాకుండా.. ''ఇప్పట్లో మమ్మల్ని ఎవరూ కలిసేందుకు వీలు లేదు. ఆఫీసు కూడా మూసేశాం. క్వారంటైన్ నిబంధనలు ముగిసి, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆఫీసు తెరుచుకుంటుంది''అని కవిత ట్వీట్ కంప్లీట్ చేశారు.
ఈ ట్వీట్ తో టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. కవిత ట్వీట్ కు కామెంట్ల వెల్లువ కొనసాగుతోంది. 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్ చేస్తున్నారు. క్వారంటైన్ విజయవంతంగా ముగించాలని, అందరూ ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆశిస్తూ.. గులాబీ కార్యకర్తలు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.