Begin typing your search above and press return to search.
ఆ ఊర్లో అందరికీ కరోనా పాజిటివ్... ఎందుకొచ్చిందంటే?
By: Tupaki Desk | 3 Sept 2020 4:40 PM ISTకరోనా వైరస్..ఈ పేరు తెలియని వ్యక్తి ఈ భూ ప్రపంచం పై ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని ప్రతి దేశానికి కరోనా మహమ్మారి వణికిపోతున్న చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని మానవత్వం పూర్తిగా మంటగలిసి పోతుంది. పక్కన ఎవరైనా పడి ప్రాణాలతో కొట్టుకుంటున్న కూడా వారికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అక్క వారితో మాట్లాడాలన్నా కూడా ప్రజలు జంకుతున్నారు. కరోనా ఎవరికి ఉంది... ఎలా చూపుతుందో కూడా అర్థం కాకపోతూండడంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఇదే సమయంలో అన్ లాక్ ప్రక్రియ కూడా కావడంతో జనం కూడా కరోనాతో సహజీవనం చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ తరుణంలో లో ఏ కార్యక్రమం కోసం అయిన ఓ పదిమంది కూడితే అక్కడ కరోనా కచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది. తాజాగా తెలంగాణలో ఓ ఊరు ఊరంతా కరోనా బారిన ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఊరిలో దాదాపుగా ప్రజలందరికీ దాదాపు కరోనా సోకింది.అయితే దీనికి కారణం కూడా ఉంది. ఆ ఊరిలో ఓ వ్యక్తి దినకర్మ సహపంక్తి భోజనాలే అసలు కారణం. సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా భయంతో ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఊరిలో మిగిలిన వారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరందరూ కరోనా టెస్టులు చేయించుకుంటే .. ఇంకెన్ని కేసులు బయట పడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు కరోనా భయంతో జనమంతా హోం ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. గ్రామస్థులెవరూ ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా కేసులు ఎక్కువగా రావడంతో గ్రామానికి వచ్చే రోడ్లను కూడా దిగ్బంధం చేశారు. ఏదేమైనా కూడా ఈ కరోనా మహమ్మారి బెడద నుండి మనం పూర్తిగా తప్పించుకునే వరకు ఎక్కువ మంది ఒకేచోట గుంపుగా చేరి కాకపోవడమే మంచిది.